• తాజా వార్తలు

వివో వీ 15 ప్రో వ‌ర్సెస్ రెడ్‌మీ నోట్ 7 ప్రో.. ఏమిటీ 48 మెగాపిక్సెల్ హడావిడి?

వివో వీ 15 ప్రో, రెడ్‌మీ నోట్ 7 ప్రో.. ఈ రెండు ఫోన్లూ  స్మార్ట్‌ఫోన్ కెమెరాను మ‌రో  హైట్‌కు తీసుకెళ్లాయి. 10, 20 కాదు ఏకంగా 48 మెగాపిక్సెల్ కెమెరాల‌తో మార్కెట్లో హ‌ల్‌చ‌ల్ చేసేస్తున్నాయి. ఇంత‌కీ ఈ ఫోన్ల‌లో పోలిక‌లేంటి, తేడాలేంటి తెలుసుకోవాల‌ని ఉందా? అయితే ఈ ఆర్టిక‌ల్ ఓ లుక్కేయండి. 

1. అమెల్డ్ వ‌ర్సెస్ ఎల్సీడీ డిస్‌ప్లే
వివో వీ 15 ప్రోలో 6.39 ఇంచెస్ డిస్‌ప్లే ఉంది. ఇది రెడ్‌మీ నోట్ 7 ప్రో (6.30 ఇంచెస్‌) కంటే పెద్ద‌ది.  వివోలో అమోల్డ్ డిస్‌ప్లే ఉంటే రెడ్‌మీలో ఎల్సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 

2. ప్లాస్టిక్ వ‌ర్సెస్ గ్లాస్ ప్యాన‌ల్ 
వివో వీ 15 ప్రోలో బ్యాక్ ప్యాన‌ల్ పాలికార్బొనేట్‌తో త‌యారు చేశారు. కానీ  రెడ్‌మీ నోట్ 7 ప్రోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో కూడిన బ్యాక్ ప్యాన‌ల్ దీనికంటే చాలా అడ్డాన్స్‌డ్‌. 
 

3.  క‌ల‌ర్స్ 
రెడ్‌మీ నోట్ 7 ప్రోలో స్పేస్ బ్లాక్‌, నెఫ్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్ ఇలా మూడు రంగుల్లో దొరుకుతుంది.  వివో వీ 15 ప్రోలో టోప‌జ్ బ్లూ, రూబీ రెడ్ అనే రెండు క‌ల‌ర్స్‌లో మాత్ర‌మే వ‌చ్చింది. 

4. ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ 
వివో వీ 15 ప్రోలో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్ ఉంటే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ బ్యాక్ ప్యాన‌ల్ మీదే ఉంది. ఈ విష‌యంలో వివోదే అడ్వాన్స్‌డ్‌. 

5.  48 మెగాపిక్సెల్ కెమెరాలు 
వివో వీ 15 ప్రో, రెడ్‌మీ నోట్ 7 ప్రో.. రెండు ఫోన్ల‌లోనూ రియ‌ర్ కెమెరా 48 మెగాపిక్సెల్స్‌తోనే వ‌చ్చాయి. వివో వీ 15 ప్రోలో శాంసంగ్ ఐసోఎసెల్ జీఎం1 సెన్స‌ర్ ఉంటే రెడ్‌మీలో అంత‌కంటే అడ్వాన్స్‌డ్‌, క్వాలిటీ సెన్స‌ర్ అయిన సోనీ ఐఎంఎక్స్ 586 సెన్స‌ర్ ఉంది. 

6.  రెండు కెమెరాలు వ‌ర్సెస్ 3 కెమెరాలు
రెడ్‌మీ నోట్ 7 ప్రోలో 48 ఎంపీ కెమెరాతోపాటు మ‌రో 5 ఎంపీ కెమెరా కూడా వెన‌క‌వైపు ఉన్నాయి. వివో వీ 15 ప్రోలో అయితే వెన‌క‌వైపే మూడు కెమెరాలున్నాయి. 48 ఎంపీతోపాటు, 8ఎంపీ, 5 ఎంపీల‌తో మ‌రో రెండు కెమెరాలిచ్చారు.  

7. పాప్ అప్ సెల్ఫీ కెమెరా
వివో వీ 15 ప్రోలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా ఉంది. అయితే పాప్ అప్ కెమెరా. అంటే డిస్‌ప్లేలోనే ఉంటుంది. కెమెరా బ‌ట‌న్ అన్ చేయ‌గానే లెన్స్ ఇలా బ‌య‌టికి వ‌చ్చి కెమెరా ఆఫ్ చేయ‌గానే లోపలికి వెళ్లిపోతుంది. ఇది అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్‌. రెడ్‌మీ నోట్ 7 ప్రోలో మాత్రం డాట్ నాచ్‌లో 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.  అంటే ఏ ర‌కంగా చూసినా సెల్ఫీ కెమెరా విష‌యంలో వివో ఫోనే హైలెట్‌. 

8. మెమ‌రీ కార్డ్ స్లాట్ 
వివో వీ 15 ప్రోలో డెడికేటెడ్ మెమ‌రీ కార్డ్ స్లాట్ ఉంటే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉన్నాయి. వివో వీ 15 ప్రోలో 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో ఒక‌టే వేరియంట్ ఉంది. రెడ్‌మీ నోట్ 7 ప్రోలో 4జీబీ/ 6జీబీ ర్యామ్‌, 64/ 128 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి.

9. ఓఎస్ 
వివో వీ 15 ప్రో, రెడ్‌మీ నోట్ 7 ప్రో.. రెండూ కూడా ఆండ్రాయిడ్ 9 (పై) ఓఎస్‌తో న‌డుస్తున్నాయి. వివో వీ 15 ప్రోలో ఫ‌న్ ట‌చ్ ఓఎస్ 9 ఉంటే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో ఎంఐయూఐ 10 వెర్ష‌న్ ఉంది. 

10. బ్యాట‌రీ 
వివో వీ 15 ప్రోలో  3,700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్ష‌న్ ఉంటే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ ఛార్జ్ 4 స‌పోర్ట్ ఉన్నాయి. రెడ్‌మీలో యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ఉంటే వివో పాత మైక్రో యూఎస్‌బీని క‌లిగి ఉంది. 

11. వాట‌ర్ రెసిస్టెంట్‌? 
రెడ్‌మీ నోట్ 7 ప్రోలో పీ2ఐ నానో కోటింగ్ ఉంది. దీనివల్ల వాన తుంప‌ర్లు ప‌డినా ఏదైనా లిక్విడ్స్ ఒలికినా ఫోన్ డ్యామేజ్ కాదు. 
వివో వీ 15 ప్రోలో ఇలాంటి ప్రొటెక్ష‌న్ లేదు.  

12. ధ‌ర రెడ్‌మీలోనే త‌క్కువ 
వివో వీ 15 ప్రో ధ‌ర 28,990 రూపాయ‌లు. అదే రెడ్‌మీలో 4జీబీ వెర్ష‌న్ 13,99.. 6జీబీ వెర్ష‌న్ 16,999. అంటే  రెడ్‌మీ ఫోనే చౌక‌.