సెల్‌ఫోన్ తయారీ కంపెనీల మధ్య పోటీతో రోజుకోకొత్త ఫీచర్ వస్తోంది. ఇక హార్డ్‌వేర్ పరంగానూ డెవలప్‌మెంట్ చాలా స్పీడందుకుంది. చైనా హార్డ్‌వేర్ కంపెనీ రీసెంట్‌గా తీసుకొచ్చిన మీడియాటెక్ హీలియో పీ22 చిప్‌సెట్‌ను కూడా వివో తన లేటెస్ట్ మోడల్ వివో వై83ను లాంచ్ చేసింది. ఈ చిప్‌సెట్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ వివో వై83నే. మిడ్ రేంజ్ ఫోన్లకు సంబంధించి హార్డ్‌వేర్ పరంగా కొత్త డెవలప్‌మెంట్ ఈ మీడియాటెక్ హీలియో పీ 22 ఆక్టాకోర్ ప్రాసెసర్. దీంతో ఫోన్ పెర్‌ఫార్మెన్స్ స్పీడ్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
యువతకు నచ్చేలా డిజైన్
ఆల్ గ్లాస్ డిజైన్‌తో, యూత్‌ను ఎట్రాక్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. 6.22 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అది కూడా మూడు వైపులా బీజిల్‌లెస్ డిస్‌ప్లే ఉండడంతో చాలా పెద్ద స్క్రీన్‌లా కనిపిస్తుంది.వీడియోలు చూడడానికి, గేమింగ్‌కు బాగా అనుకూలంగా ఉంటుంది. 2.5డీ కర్వ్‌డ్‌గ్లాస్ ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లే ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ, ఫేస్ రికగ్నైజేషన్ ఆల్గరిథమ్స్‌తో కూడిన 8 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకత. అయితే ఇప్పుడు అన్మి స్మార్ట్‌ఫోన్స్‌లో వస్తున్న ఫింగర్‌ప్రింట్ సెన్సర్ లేకపోవడం మైనస్ పాయింట్ . 4జీ వోల్ట్‌తో నడిచే డ్యూయల్ సిమ్ స్లాట్‌తోపాటు ఎక్స్‌ట్రాగా మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంది. ఇండియాలో దీని ధర 16వేల వరకు ఉండొచ్చు.
ఇతర స్పెసిఫికేషన్లు
* 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (ఎస్డీ కార్డ్‌తో 256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్)
* 13 ఎంపీ రియర్ కెమెరా
* 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 3,260 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ ఓరియో 8.1 విత్ ఫన్‌టచ్ ఓఎస్ 4.0