• తాజా వార్తలు

4జీ ర్యామ్ తో షియోమీ మ్యాక్స్ 2


ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకెళ్తున్న షియోమీ మరో కొత్త మోడల్ తో రావడానికి సిద్ధమైపోయింది. మరో మూడు రోజుల్లో తన కొత్త ఫోన్ లాంఛ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 'ఎంఐ మ్యాక్స్ 2' పేరుతో ఈ నెల 25వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర ఎంతన్నది ఇంకా ప్రకటించనప్పటికీ స్పెసిఫికేషన్లు మాత్రం వెల్లడయ్యాయి.

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 స్పెసిఫికేషన్లు



6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ