చైనీస్ స్మార్టు ఫోన్ మేకర్ అల్కాటెల్ తాజగా కొత్త మోడల్ తో మార్కెట్లోకి వచ్చింది. ఒప్పో, వివో వంటి స్మార్టు ఫోన్ సంస్థల కంటే ముందునుంచే భారత్ లో ఉనికిలో ఉన్నప్పటికీ టాప్ పొజిషన్ కు చేరలేకపోతున్న అల్కాటెల్ తన తాజా మోడల్ పై చాలా ఆశలు పెట్టుకుంది.
తాజాగా 'పిక్సీ 4(6)' పేరిట అల్కాటెల్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6అంగుళాల డిస్ ప్లేతో ఆకట్టుకుంటున్న దీని ధర రూ.9,100. కాగా కెమేరా పనితనం తక్కువగా ఉన్నట్లు టాక్. కాగా ఈ మోడల్ చైనాలో గత ఏడాదే విడుదల కాగా చాలా ఆలస్యంగా భారత్ లో లాంచ్ చేశారు.
అల్కాటెల్ పిక్సీ 4 (6) ఫీచర్లు...
6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, 2580 ఎంఏహెచ్ బ్యాటరీ