• తాజా వార్తలు

మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ నోకియా ఫీచర్ ఫోన్లు మీకోసం 

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్‌ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, చిన్న ఫోన్‌ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా ఫోన్లు తయారు చేసే హెఎండీ గ్లోబల్‌ కూడా నోకయా ఫీచర్ ఫోన్ల మీద బాగా దృష్టి పెట్టింది. ఈ ఫోన్లు మొత్తం 24 ఇండియా భాషలను సపోర్ట్ చేయనున్నాయి. అలాగే డ్యూయెల్ సిమ్ సపోర్ట్ తో వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ నోకియా ఫీచర్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం. 

Nokia 106 2018
రూ.1560 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. 
నోకియా 106 (2018) ఫీచర్లు
1.8 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 160 x 128 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియాటెక్ 6261డి ప్రాసెసర్, 4 ఎంబీ ర్యామ్, ఎఫ్‌ఎం రేడియో, నేటివ్ గేమ్స్, ఫ్లాష్ లైట్, మైక్రో యూఎస్‌బీ కనెక్టర్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ, 21 రోజుల స్టాండ్ బై టైం, 15.7 గంటల టాక్‌టైం ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి.

Nokia 105 2017
రూ.1049 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. 
నోకియా 105 ఫోన్‌లో 1.8 ఇంచ్ డిస్‌ప్లే, 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్, 500 టెక్ట్స్ మెసేజ్ స్టోరేజ్, 2వేల కాంటాక్ట్స్ స్టోరేజ్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ నోకియా సిరీస్ 30 ప్లస్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది. 

Nokia 130
రూ.1,725 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. 
నోకియా 130 ఫోన్‌లో 1.8 ఇంచ్ డిస్‌ప్లే, వీజీఏ కెమెరా, ఎంపీ3 ప్లేయర్, 4 ఎంబీ ర్యామ్, 8 ఎంబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 1020 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కూడా నోకియా సిరీస్ 30 ప్లస్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు.

Nokia 150 Dual SIM
రూ.1,974 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. 
నోకియా 150, నోకియా 150 డ్యూయెల్ అనే రెండు బేసిక్ మోడల్ ఫోన్లను విడుదల చేసింది. ఎమ్‌పీత్రీ ప్లేయర్, ఎఫ్‌ఎం రేడియో, బ్లూటూత్ వంటి ఫీచర్స్‌తో పాటు ఫ్లాష్ సౌలభ్యంతో వీజీఎ కెమెరా కూడా ఉంటుంది.

Nokia 108 Dual SIM
రూ.1,900 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. 
1.8 ఇంచ్ డిస్‌ప్లే, 0.3 ఎంపీ కెమెరా, 4 ఎంబీ ర్యామ్, 8 ఎంబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 950 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Nokia 216 Dual SIM
రూ.1,950 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. 
Dual Feature Phone సిమ్, N/A ర్యామ్ ,N/A ఇంటర్నల్ స్టోరేజ్ ,ఇంటర్నల్ స్టోరేజ్ 32 GB కు పెంచుకోవచ్చు, 1020 mAh బ్యాటరీ ,Bluetooth,మెయిన్ కెమేరా .3 MP షూటర్,Video Recording .3 తో సేల్ఫీస్ తీసుకోవటానికి ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా కూడా ఉంది.