స్మార్టు ఫోన్ మార్కెట్లో ఒక్కసారిగా దూసుకొచ్చినా మిగతా ప్లేయర్ల పోటీని తట్టుకోలేకపోతున్న కూల్ ప్యాడ్ తాజాగా మరో ప్రయత్నం చేసింది. మరో కొత్త స్మార్టు ఫోన్ తో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. అయితే... ధరకు తగిన ఫీచర్లు లేకపోవడంతో ఇది ఆదరణ పొందడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కూల్‌ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'డీఫియంట్'ను అమెరికా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో ఈ ఫోన్ భారత్‌లోనూ లభ్యం కానుంది. రూ.6,500 ధరకు దీన్ని యూజర్లు కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు
5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
1 జీబీ ర్యామ్
8 జీబీ స్టోరేజ్
32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
బ్లూటూత్ 4.2
5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ
2450 ఎంఏహెచ్ బ్యాటరీ