చైనా మొబైల్ తయారీదారు సంస్థ రెడ్‌మీ రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 7, నోట్ 7 ప్రో ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. భారత్ లో మొట్టమొదటిసారిగా కంపెనీ ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య ఉన్న వ్యత్యాసాలేంటో ఓ సారి చూద్దాం.
ధరలు, లభ్యత...
రెడ్‌మీ నోట్ 7...స్మార్ట్ ఫోన్ రెండు ర్యామ్ స్టోరేజీ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. 3జిబి ర్యామ్/64జీబి మెమరీ వేరియంట్లో వస్తుంది. ఇక 4జిబి ర్యామ్/64జీబి మెమరీ వేరియంట్ కి వర్తిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ. 9,999రూపాయలు.
*ఇక రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్/ 64జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్లో వర్తిస్తుంది. దీని 13,999రూపాయలు. 6జిబి/128జిబి మెమరీ ధర 16,999 రూపాయలుగా ఉంది. ఈ ఫోన్లు బ్లాక్, రెడ్ , బ్లూ కలర్స్ లో లభ్యం కానుంది. రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో మార్చి 6వ తేదీ నుంచి యూజర్లకు అందుబాటులో రానుంది.
*ఇక రెడ్ మీ నోట్ 7 ప్రో మార్చి 13వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోం స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి.
డిస్ప్లే, డిజైన్...
ఈ రెండు కొత్త ఫోన్లలో 6.3 ఇంచుల ఫుల్ హెచ్ డి డిస్ప్లేను ఏర్పాటు చేశారు. శాంసంగ్ ఎం10,ఎం20 స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఈ ఫోన్లు కూడా వాటర్ డ్రాప్ స్ట్లైల్లో ఉండనున్నాయి. గ్లాస్ బాడీ, మెటల్ ఫ్రేమ్, బ్యాక్ డ్యుయల్ కెమెరాలను అమర్చారు. ఈ రెండు ఫోన్లూ కూడా పి2ఐ కోటింగ్ ఉన్న వాటర్ ఫ్రూఫ్ రెసిటెంట్ తో వస్తున్నాయి.
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజి....
రెడ్‌మీ నోట్ 7 పవర్ తో ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డాగ్రెన్ 660 ప్రాసెసర్ తోపాటు అడెన్రో 512జిపియు జత కలిగి ఉంటుంది. ఈ డివైస్ 3జిబి ర్యామ్/32జిబి స్టోరేజితోపాటు 4జిబి ర్యామ్ /54జిబి ఇంటర్నల్ స్టోరేజితో అందుబాటులో ఉంటుంది. మైక్రో ఎస్డి కార్డు స్లాట్ ను కలిగి ఉంటుంది. 256 జిబి వరకు విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.
* ఇక రెడ్ మీ నోట్ 7 ప్రో క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 675 ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. TSMC యొక్క 11nm మాన్యుఫక్చర్ ప్రొసెసర్ లో తయారు చేశారు. ఈ డివైజు అడ్రిన్ 612జిపియూ తో వస్తుంది.
* రెడ్ మీ నోట్ 7 మాదిరిగానే ప్రొ వేరియంట్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ను అమర్చారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు కెమెరా స్పెసిఫికేషన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సెటప్ 5మెగాపిక్సెల్ సెంకడరీ డెప్త్ సెన్సార్ తో జతచేయబడి ఉంటుంది. 4కె వీడియో షూటింగ్ కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కోసం 13మెగాపిక్సెస్ సెన్సార్ కలిగి ఉంది.
బ్యాటరీ, OS,కనెక్టువిటీ
ఈ రెండు డివైజులు కూడా గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తాయి. క్వాల్కమ్ క్విక్ ఛార్జీ కోసం 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే 4,000ఎంఏహెచ్ బ్యాటరీని ఉంటుంది. *ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ పరంగా చూసినట్లయితే...ఈ రెండు డివైజులను ఒక రేర్ మౌంట్ చేయబడిన ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఒక usb, టైప్ సి పోర్ట్ 3.5ఎంఎం, హెడ్ ఫోన్ జాక్ , వై -ఫై, బ్లూటూత్ 5.0 ఇన్ ఫ్రాడ్ , హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉన్నాయి.