ఎలక్ట్రానిక్ డివైజస్ తయారీలో వరల్డ్ ఫేమస్ అయిన శాంసంగ్‌కు మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో గతేడాది శాంసంగ్ ఎస్ 7 నోట్‌తో గట్టి దెబ్బే తగిలింది. బ్యాటరీ ఎగ్జాస్టయి పేలిపోవడం వంటి ఘటనలతో ఒక్కసారి షాక్ తింది. కొన్ని లక్షల ఎస్ 7 ఫోన్లను వెనక్కి తీసుకుంది. దీంతో ఫైనాన్షియల్‌గానూ లాసయింది. పోయిన ప్రతిష్ఠను తిరిగి దక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో ఎస్ 8, ఎస్ 8+ మోడల్స్‌ను అత్యున్నత ప్రమాణాలతో రంగంలోకి తీసుకొస్తోంది. ప్రీఆర్డర్ ఇచ్చి బుక్ చేసుకున్న కొంత మంది కొరియన్లకు ఈ ఫోన్ ఇప్పటికే చేతికి అందింది. అయితే ఎస్ 8లో డిస్‌ప్లే ప్రాబ్లం ఉందంటూ మంగళవారం ఓ న్యూస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవడంతో శాంసంగ్ మరోమారు షాక్ తినాల్సి వచ్చింది. బుధవారం ఈ రెండు మోడళ్లను ఇండియాలో లాంచ్ చేయడానికి శాంసంగ్ రెడీ అవుతున్న టైంలో మంగళవారం ఈ న్యూస్ స్ప్రెడ్ అవడం కంపెనీ ని ఇరకాటంలో పడేసింది.
ప్రాబ్లం ఏంటి?
కొరియాలో ఎస్ 8ను కొన్న కస్టమర్లు కొందరు డిస్‌ప్లేలో ప్రాబ్లం ఉందని కంప్లయింట్ చేస్తున్నారు. డిస్‌ప్లేలో రెడ్‌కలర్ ఎక్కువగా కనిపిస్తుందన్నది వారి కంప్లయింట్. ముఖ్యంగా లోకల్ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ పోమ్‌ప్పూ, రూలీవెబ్ ల్లో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫొటోలు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఫోన్‌లోని డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో సరిచేసేందుకు ట్రై చేసినా సెట్టవలేదని కొంత మంది యూజర్లు చెబుతుండడం ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయింది. సౌత్‌కొరియాలో లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ అయిన నేవర్‌లో "గెలాక్సీ ఎస్8 రెడ్ స్క్రీన్" అనేది
మంగళవారం అత్యధిక మంది సెర్చ్ చేసిన అంశం కావడం.. ఎస్ 8 డిస్‌ప్లే ప్రాబ్లం గురించి నెటిజన్లలో ఎంతగా పాకిపోయిందో చెబుతుంది.
శాంసంగ్ స్పందన
కలర్ డిస్‌ప్లే ఫోన్ క్వాలిటీకి సంబంధించింది కాదని, కలర్ డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో సరిచేసుకోవచ్చని శాంసంగ్ స్పోక్స్‌పర్సన్ చెప్పారు. అయితే కొంతమంది సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్లినా ప్రాబ్లం రెక్టిఫై కాలేదని, సర్వీస్ సెంటర్ ఎక్స్‌పర్ట్స్ ఫోన్‌ను మార్చుకోమంటున్నారని కొంతమంది యూజర్లు చెబుతున్నారు. గెలాక్సీ ఎస్8, ఎస్ 8+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉందని, కలర్ డిస్‌ప్లేలో రిచ్‌నెస్ ఎక్కువగా చూపెడుతుందని శాంసంగ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ డిస్‌ప్లే వల్ల కలర్ రేంజ్, శాచ్యురేషన్, షార్ప్‌నెస్ అనేవి ఫోన్ వాడే ఎన్విరాన్‌మెంట్ బట్టి మారుతుంటాయని చెప్పింది. కలర్ బ్యాలన్స్ చేసుకోవాంటే " సెట్టింగ్స్> డిస్‌ప్లే > స్క్రీన్ మోడ్ > కలర్ బ్యాలన్స్" లోకి వెళ్లి మాన్యువల్‌గా మార్చుకోవచ్చని ప్రకటించింది.