• తాజా వార్తలు

పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్‌ ఫోన్లు లాంచ్, హైలెట్ ఫీచర్లు మీ కోసం

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న నూతన పిక్స‌ల్ ఫోన్ల‌యిన పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్‌ల‌ను కాలిఫోర్నియాలో జ‌రిగిన గూగుల్ ఐ/వో 2019 ఈవెంట్‌లో విడుద‌ల చేసింది. ఇండియాలో Google Pixel 3a ధర రూ.39,999గా నిర్ణయంచారు.  Google Pixel 3a XL ధరను ఇండియాలో రూ.44,999గా నిర్ణయించారు. ఈ రెండు స్మార్ట్  ఫోన్లు 4GB RAM/ 64GB storageతో మార్కెట్లోకి దూసుకువచ్చాయి. అయితే ఈ ఫోన్లు ఇండియాలో అఫిషియల్ గా ఇంకా లాంచ్ కాలేదు. ఈ నెల 15న ఇండియాలో లాంచ్ అవుతాయని కంపెనీ తెలిపింది. 

గూగుల్ పిక్స‌ల్ 3ఎ ఫీచ‌ర్లు
5.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,  డ్రాగ‌న్‌ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 670 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యాక్టివ్ ఎడ్జ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫాస్ట్ చార్జింగ్‌.

గూగుల్ పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్ ఫీచ‌ర్లు
పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్ - 6 ఇంచుల డిస్‌ప్లే, 2160×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,5.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,  డ్రాగ‌న్‌ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 670 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యాక్టివ్ ఎడ్జ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ నెల 8 నుంచి ఈ ఫోన్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొత్తం మూడు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.Clearly White, Just Black, and Purplish రంగుల్లో లభ్యం అవుతున్నాయి. అయితే ఇండియాకి రెండు కలర్స్ వేరియంట్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ కొనుగోలు ద్వారా యూజర్లు 3 నెలల పాటు YouTube Music Premium subscription ఉచితంగా పొందుతారు.

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఈ సిమ్ సపోర్ట్ తో వచ్చాయి. Airtel and Reliance Jioలు ఇప్పటికే ఈ సిమ్ లను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 9పై మీద ఆపరేట్ అవుతాయి.3 సంవత్సరాల పాటు  ఓఎస్ అప్ డేట్ అందుకునే విధంగా వీటిని తీర్చిదిద్దారు.కంపెనీ నుంచి వచ్చిన AR Core framework అలాగే  augmented reality applicationsను సపోర్ట్ చేసే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

వెనుక భాగంలో 12.2 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, దీనికి ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు.ఇంతకు ముందు ఫోన్లు సింగిల్ సిమ్ తో రాగా ఈ ఫోన్లు మాత్రం డ్యూయెల్ సిమ్ తో మార్కెట్లోకి వచ్చాయి.