• తాజా వార్తలు

వీఓఎల్టీయీ సపోర్టుతో ఐబాల్ ట్యాబ్లెట్

ట్యాబ్లెట్ల తయారీలో మంచి ముద్ర సంపాదించుకున్న ఐబాల్ తాజాగా మరో కొత్త ట్యాబ్ ను రిలీజ్ చేసింది. స్లైడ్ ఎలాన్ 4జీ2 పేరుతో విడుద‌ల చేసి ఈ ట్యాబ్ మిగతా అన్నిటికీ భిన్నంగా మంచి బ్యాటరీ బ్యాకప్ తో వస్తోంది. ఇందులో ఉన్న 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీన్ని ఎక్కువ సమయం పనిచేసేలా చేస్తుంది. దీని ధర రూ.13,999.
9 భారతీయ భాషల్లో..
తొమ్మిది భారతీయ భాషలను ఈ ట్యాబ్ సపోర్టు చేయడం మరో విశేషం. ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇది పనిచేస్తుంది. 10.1 అంగుళాల ఐపీఎస్ స్క్రీన్ తో ఇది అచ్చంగా ఒక ల్యాప్ టాప్ ను తలపిస్తోంది. దీనికి వీఓఎల్టీఈ సదుపాయం కూడా ఉండడంతో వీఓఎల్టీఈ ల్యాప్ టాప్ గా భావించొచ్చు. ఫీచర్లన్నీ ల్యాప్ టాప్ లా ఉన్నప్పటికీ బరువు మాత్రం కేవలం 575 గ్రాములే ఉంది.
ఐబాల్ స్లైడ్ ఎలాన్ 4జీ2 స్పెసిఫికేషన్లు
* 10.1 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే
* 1280 x 800 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌
* 2 జీబీ ర్యామ్‌
* 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
* 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* వాయిస్ కాలింగ్‌
* 5 మెగాపిక్స‌ల్ రియర్ కెమెరా
* 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 4.0