• తాజా వార్తలు

అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 7, కారణం ఇదే 

ఐఫోన్ అభిమానులకు ఆపిల్ కంపెనీ శుభవార్తను మోసుకొచ్చింది. ఈ శుభవార్తతో ఇఖపై ఐఫోన్ 7 అత్యంత తక్కువ ధరకే ఇండియాలో లభించనుంది. దీనికి ప్రధాన కారణం ఐఫోన్ 7 మేడ్ ఇన్ ఇండియాగారూపుదిద్దుకోనుంది. ఇకపై ఈ ఫోన్ తయారీ పూర్తిగా ఇండియాలోనే సాగనుంది. మేడిన్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో భాగంగా దిగ్గజ సంస్థ ఆపిల్‌ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది . బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్‌ ఐపోన్‌ 7ను రూపొందిస్తోంది. ఈ ఫోన్ల అసెంబ్లింగ్‌ ప్రక్రియ మార్చి నెలలో ప్రారంభమైదని ఆపిల్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. 

భారతదేశంతో తమ దీర్ఘకాలిక నిబద్ధతను కొనసాగిస్తూ స్థానిక కస్టమర్లకోసం స్థానికంగా ఐఫోన్ 7ని ఉత్పత్తి చేస్తు‍న్నందుకు గర్వంగా ఉందని ఆపిల్‌ ప్రకటించింది. భవిష్యత్తులో మేడిన్‌ ఇండియా పోర్టిఫోలియోను మరింత విస్తరించనుందని కూడా తెలుస్తోంది. దీంతో  ఐఫోన్‌ 7 బేసిక్‌ మోడల్‌ రూ.39వేలకంటే తక్కువకే అందుబాటులోకి వస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ మొబైల్స్‌తో పోలిస్తే ఐఫోన్లు ఖరీదు ఎక్కువే. దీనికి తోడు విదేశీ స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని కూడా కేంద్రం భారీగా పెంచింది. ఈ నేపథ్యంలోనే సుంకాల బారి నుంచి తప్పించుకునేందుకు గత ఏడాది నుంచే భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని  చేపట్టింది ఆపిల్‌ సంస్థ. తైవాన్‌ దిగ్గజం విస్ట్రోన్‌ సహకారంతో బెంగళూరులోని ప్లాంట్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈలను రూపొందించిన సంగతి తెలిసిందే.