• తాజా వార్తలు

రూ. 8,999కే 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు మీకోసం

చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని పేరు ఇన్‌ఫినిక్స్ హాట్ 7 ప్రో. రెడ్‍‌మీ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం20కి పోటీగా ఇది మార్కెట్లోకి వచ్చింది. 6GB RAMతో రూ.10వేల లోపు విలువ కలిగిన తొలి మొబైల్ ఫోన్ హాట్ 7 ప్రో అని కంపెనీ వెల్లడించింది. దీని ధరను రూ.9,999. స్టార్టింగ్ ఆఫర్ కింద రూ.1,000 డిస్కౌంట్ ఇస్తోంది.ఈ స్మార్ట్ ఫోన్లు మిడ్‌నైట్ బ్లాక్, అక్వా బ్లూ కలర్‌లలో అందుబాటులో ఉన్నాయి. 

ఇందులో 6.19 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. డెడికేటెడ్ మెమొరీ, డ్యుయల్ సిమ్ కార్డు స్లాట్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 17వ తేదీ నుంచి లభ్యం కానుంది. అయితే జూన్ 21వ తేదీ వరకు ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.1వేయి తగ్గింపు ధరకు.. అంటే.. రూ.8,999 ధరకు అందివ్వనున్నారు.

ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రొ ఫీచర్లు
6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.