నోకియా ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీఏ గ్లోబల్ తాజాగా నోకియా 5.1, నోకియా 3.1, నోకియా 2.1 ఫోన్లను రష్యాలో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నోకియా 5, నోకియా 3, నోకియా 2లకు ఇవి అప్‌గ్రేడెడ్ వెర్షన్లు. ఈ రెండు మోడల్స్ మధ్య తేడాలేంటో ఓ లుక్కేద్దాం రండి.
డిజైన్ అండ్ డిస్‌ప్లే
* నోకియా 5.1, నోకియా 5 రెండూ కూడా 6000 సిరీస్ అల్యూమినియంతో తయారయ్యాయి. అయితే నోకియా 5.1లో సాటిన్ ఫినిష్ ఇచ్చారు. నోకియా 5లో 5.2 ఇంచెస్ హెచ్‌డీ రిజల్యూషన్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 2.5 డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటే నోకియా 5.1లో 5.5ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. స్క్రీన్ ఏస్పెక్ట్ రేషియో నోకియో 5లో 16: 9 ఉంటే నోకియా 5.1లో 18: 9 ఉంది. అందుకే 5.1 టాల్ డిస్‌ప్లేతో కనిపిస్తుంది. అంతేకాదు మినిమన్ బీజిల్స్‌తో మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
* నోకియా 3, 3.1రెండు మోడల్స్‌లోనూ పాలికార్బనేట్ బ్యాక్ ప్యానెల్, అల్యూమినియం ఫ్రేమ్ ఉన్నాయి. అయితే నో్కియా 3లో కార్నిగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన 5.2 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటే 3.1లో సేమ్ స్క్రీన్ 5.2 ఇంచెస్ సైజ్‌తో వచ్చింది.
నోకియా 2, 2.1రెండూ కూడా ఆండ్రాయిడ్ గో ఓఎస్‌తో నడిచే స్మార్ట్‌ఫోన్లే.
* నోకియా 2లో కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన5 ఇంచెస్ ఎల్‌సీడీ హెచ్‌డీ డిస్‌ప్లేఉంటే నోకియా 2.1లో యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కవర్ గ్లాస్ ఉన్న 5.5 ఇంచెస్ హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంది.
కెమెరా
* నోకియా 5తో పోల్చితే 5.1లో కెమెరాను బాగా ఇంప్రూవ్ చేశారు. రియర్ సైడ్‌లో ఆటోఫోకస్‌తో కూడిన 16ఎంపీ కెమెరా, ఫ్రంట్ 84.6 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉన్న 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పెట్టారు. అదే నోకియా 5లో బ్యాక్ కెమెరా 13 ఎంపీ, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్. వ్యూయింగ్ యాంగిల్ నోకియా 5.1తో పోల్చితే తక్కువ.
* నోకియా 3లో ఫ్రంట్, బ్యాక్ కూడా ఆటోఫోకస్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ కెమెరాలుంటే 3.1లో ఆటోఫోకస్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. ఫ్రంట్ 84.6 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉన్న 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పెట్టారు.
* నోకియా 2, 2.1 రెండు వెర్షన్లలోనూ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ప్రాసెసర్ అండ్ బ్యాటరీ
* నోకియా 5లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అదే నోకియా 5.1లో 2.0 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 6750ఎన్ ప్రాసెసర్ అమర్చారు. ఇది నోకియా 5 కంటే 40% ఫాస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.. 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలోనూ 3,000 ఎంఏహెచ్ బ్యాటరీయే ఉంది.
* నోకియా 3లో 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీకే 6737 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. నోకియా3.1లో 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ 6750ఎన్ ప్రాసెసర్ అమర్చారు. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.. 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. నోకియా 3లో 2,630 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే నోకియా 3.1లో 2,990 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
* నో్కియా 2లో 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్ ఉంటే 2.1లో అడ్వాన్స్‌డ్ వెర్షన్ అయిన 1.4 గిగా హెర్ట్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్‌ను అమర్చారు