క్వాలిటీ స్మార్టు ఫోన్ మేకర్ గా పేరు తెచ్చుకుంటున్న ఎల్ జీ తన కొత్త మోడల్ స్టైలో 3 ప్లస్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే జీ 6 వంటి మోడళ్ల ధరను భారీగా తగ్గించిన ఎల్ జీ స్టైలో 3 ప్లస్ విషయంలో మొదట్లోనే తక్కువగా నిర్ణయించింది. రూ.14,600 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.
అయితే.. కేవలం 2జీబీ ర్యామ్ మాత్రమే ఉన్న ఈ మోడల్ ధర ఇది కూడా ఎక్కువేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతా 3జీబీ, 4జీబీ ర్యామ్ మొబైల్స్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో 2జీ ర్యామ్ తో వస్తున్న ఫోన్ కు సుమారు రూ.15 వేల ధర ఎక్కువేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే.. ఇన్ బిల్ట్ క్వాలిటీ విషయంలో మంచి మార్కులు పొందిన ఎల్ జీ బ్రాండ్ కు ఈ మాత్రం ధర పెట్టడంలో నష్టమేమీ ఉండదన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.
కాగా ఇప్పుడొస్తున్న అత్యధిక శాతం ఫోన్లలో 5.5 డిస్ ప్లే మాత్రమే ఉంటుండగా ఇందులో 5.7 అంగుళాల డిస్ ప్లే ఉండడం విశేషం. దీనివల్ల వీడియోలు మరింత పెద్ద సైజులో చూసేందుకు అవకాశం ఉంటుంది.