• తాజా వార్తలు

బడ్జెట్ ధరకే.. 48MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతో మెయ్‌జు 16ఎక్స్‌ఎస్‌

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు మెయ్‌జు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 16ఎక్స్‌ఎస్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.  ప్రధానంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్‌  కెమెరా సహా ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలను రియర్‌ సైడ్‌లో ఏర్పాటు చేసింది. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. రెండు  వేరియంట్లలో అందుబాటులోకి  రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ  ధరను  రూ.17,150 గా నిర్ణయించింది.

ఇందులో 6.2 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌లను అమర్చినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. దీనికి ఫాస్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్‌ను కేవలం 0.2 సెకన్ల వ్యవధిలోనే అన్‌లాక్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీంతో కూడా ఫోన్‌ను కేవలం 0.2 సెకన్ల వ్యవధిలోనే అన్‌లాక్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో ఉన్న 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 

మెయ్‌జు 16ఎక్స్‌ఎస్ ఫీచర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2232 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.