దిగ్గజ మొబైల్ సంస్థ మోటరోలా ఒకేసారి 4 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌కు కొనసాగింపుగా జి 7, జి 7 ప్లే, జి7 ప్లస్, జి 7 పవర్‌ను స్మార్ట్‌ఫోన్లను బ్రెజిల్ లో జరిగిన ఓ ఈవెంట్లో ఆవిష్కరించింది. అయితే ఇవి ఈ ఏడాది చివరికి భారతీయ మార్కెట్లోకి రానున్నాయి. నాచ్ డిస్‌ప్లే లాంటి ప్రీమియం ఫీచర్లతో, ప్రీమియం ధరల్లో వీటిని తీసుకొచ్చింది. నాలుగు ఫోన్ల ధరలను ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..
మోటో జీ 7
ధర రూ. 21,300 ఉంటుందని అంచనా
మోటో జీ7 ఫీచర్లు
6.24 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2270 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
మోటో జీ 7 ప్లే
ధర రూ. 14,215గా ఉండే అవకాశం
మోటో జీ7 ప్లే ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1512×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, వాటర్ రీపెల్లెంట్ పీ2ఐ కోటింగ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్.
మోటో జీ 7 పవర్
ధర అంచనా రూ17,785
మోటో జీ7 పవర్ ఫీచర్లు
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1570×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, వాటర్ రీపెల్లెంట్ పీ2ఐ కోటింగ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.
మోటో జీ 7ప్లస్
ధర సుమారుగా రూ.24 320
మోటో జీ7 ప్లస్ ఫీచర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2270 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, వాటర్ రీపెల్లెంట్ పీ2ఐ కోటింగ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.