• తాజా వార్తలు

Motorola One Vision : ఇండియాలో తొలి 21:9 సినిమా విజన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ 

మోటోరోలా నుంచి మరో ఆండ్రాయిడ్ వన్ ఫోన్ ఇండియాలో లాంఛైంది. గత నెలలో బ్రెజిల్‌లో రిలీజైన 'మోటోరోలా వన్ విజన్' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్‌ చేసింది. కంపెనీ దీని ధరను రూ. 19,999 గా నిర్ణయించింది. ఆధునిక ఫీచర్లు,  ప్రధానంగా  సినిమా విజన్‌ డిస్‌ప్లే, నైట్‌ విజన్‌ ఫీచర్‌తో 48, 5 మెగా పిక్సెల్‌ సామర్ధ్యం గల  డబుల్‌ రియర్‌  కెమెరా లాంటి  ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్‌తో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 

ఇందులో ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న ఇన్ స్క్రీన్ కెమెరాను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో ఉన్న 3500 ఎంఏహెచ్ బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ కి పంచ్ హోల్ డిస్ ప్లేని పొందుపరిచారు. మోటోరోలా వన్ విజన్ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. సీన్ డిటెక్షన్, పోర్ట్‌రైట్ హైలైట్, నైట్ విజన్ లాంటి ఫీచర్లున్నాయి

మోటోరోలా వన్ విజన్ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.