స్మార్టు ఫోన్ల మార్కెట్ విస్తరించాక.. ప్రజల వినియోగం పెరిగాక ప్రతి నెలా సరికొత్త ఫీచర్లతో, సరికొత్త ఆప్షన్లతో సంస్థలు సరికొత్త స్మార్టు ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుత మే నెలలోనూ కొన్ని ముఖ్యమైన ఫోన్లు రానున్నాయి. అవేంటో చూద్దామా?
1. రెడ్ మీ 4, రెడ్ మీ 4 ప్రైం
చైనా మొబైల్ తయారీ సంస్థ జియోమీ కొద్దికాలం కిందట రెడ్ మీ 3ఎస్, 3ఎస్ ప్రైం ఫోన్లను తీసుకురావడం.. అవి సూపర్ సక్సెస్ కావడం తెలిసిందే. ఈ మే నెలలో జియోమీ ఆ సిరీస్ కు కొనసాగింపుగా రెడ్ మీ 4, 4 ప్రైం రెండూ కానీ, లేదంటే రెడ్ మీ 4 కానీ లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రెడ్ మీ 4.. 5 అంగుళాల డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబీ రామ్, 16జీబీ ఇంటర్నల్ మెమొరీతో రానుంది. ర
రెడ్ మీ 4 ప్రైం విషయానికొచ్చేసరికి అది 3జీబీ రామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, స్నాప్ డ్రాగన్ 625 చిప్ సెట్ తో రానుంది. రెండిట్లోనూ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఈ రెండు ఫోన్లనూ ఇప్పటికే చైనాలో లాంచ్ చేశారు. ఇండియాలో రెడ్ మీ 4 ధర రూ.6,999... ప్రైం ధర రూ.9,499 ఉండొచ్చని అంచనా.
2. హ్యువాయ్ హానర్ 8
* మే 10న దీన్ని భారత్ లో లాంఛ్ చేయబోతున్నారు. 5.2అంగుళాల డిస్ ప్లే, 4 జీబీ ర్యాం, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ దీని ప్రత్యేకతలు.
3. యురేకా బ్లాక్
మైక్రోమాక్స్ కే చెందిన యురేకా నుంచి ఫోన్ల తయారీ ఆపేస్తారని పుకార్లు వస్తున్నా కూడా ఆ సంస్థ మాత్రం మేలో యురేకా బ్లాక్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు.
4. శాంసంగ్ గెలాక్సీ ఏ3, గెలాక్సీ జే 7
ఈ మే నెలలో శాంసంగ్ నుంచి రెండు ఫోన్లు వస్తున్నాయి. ఇందులో ఏ3 4.8 డిస్ ప్లే తో వస్తుందని చెబుతున్నారు. జే 7లో శాంసంగ్ సొంత చిప్ సెట్ ఎక్సినోస్ 7870 ఉండొచ్చు.
5. జియోమీ 6
చైనాలో గత నెల రిలీజైన ఈ ఫోన్ ఈ నెలలో ఇండియాలో రిలీజ్ కానుంది.
వీటితో పాటు హెచ్ టీసీ యు11, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ జడ్ ప్రీమియం కూడా లాంచ్ కానున్నాయి.