• తాజా వార్తలు

భారత మార్కెట్లోకి నోకియా 2.2 , ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 2.2ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. నోకియా 2.1 కి సక్సెసర్‌గా బడ్జెట్‌ ధరలో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను  హెచ్‌ఎండీ గ్లోబల్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలైన లేటెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇది షియోమి రెడ్‌మి 7కి గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. వాటర్‌డ్రాప్‌ నాచ్‌, ఏఐ ఆధారిత  రియర్‌, సెల్ఫీ కెమెరాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. 

ఇందులో 5.71 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలో మరో 2 ఏళ్ల పాటు వచ్చే నూతన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, మరో 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఈ ఫోన్‌కు లభిస్తాయి. ఇందులో వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. 

ఈ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే రెండు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు కోసం 3 వేర్వేరు స్లాట్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999 ఉండగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999గా ఉంది. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఈ ధరల కింద ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాగా ఫ్లిప్‌కార్ట్, నోకియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. 

లాంచింగ్‌ ఆఫర్‌: 
నోకియా 2.2 కొనుగోలు చేసిన జియో వినియోగదారులకు  2,200 క్యాష్‌బ్యాక్‌తోపాటు, 100 జీబీ డాటా ఉచితం.  ప్లిప్‌కార్ట్‌, నోకియా తదితర ఈ స్టోర్ల ద్వారా  జూన్‌ 11 నుంచి అందుబాటులోకి రానుంది.  అయితే ప్రీబుకింగ్స్‌ నోకియా ఈ స్టోర్ల ద్వారా  నేటి నుంచే ప్రారంభం.

ధరలు
2జీబీ ర్యామ్‌ /16జీబీ స్టోరేజ్‌ధర  రూ. 6,999
3జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్‌  ధర రూ. 7,999
ఈ ధరలు పరిమిత కాలానికి మాత్రమే పరిమితం. జూన్‌ 30 తరువాత నోకియా  2.2 ధరలు మారనున్నాయి. 
2జీబీ ర్యామ్‌ /16జీబీ స్టోరేజ్‌ధర  రూ. 7,699
3జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్‌  ధర రూ. 8,699

నోకియా 2.2 ఫీచర్లు
5.71 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.