• తాజా వార్తలు

6జిబి ర్యామ్‌లో Nokia 6.1 Plus,ధర రూ. 18,488

ఈ ఏడాది MWC 2019 techషో త్వరలో దూసుకొస్తున్న నేపథ్యంలో హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా సరికొత్తగా ముందుకు దూసుకువచ్చింది. కంపెనీ ఈ మధ్య లాంచ్ చేసిన Nokia 6.1 Plusలో మరో వేరియంట్ Nokia 6.1 Plus 6జిబి ర్యామ్ ఫోన్ ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది.

Nokia 6.1 Plus 6జిబి ర్యామ్ వేరియంట్ ధరని ఇండియాలో రూ.18,499గా నిర్ణయించారు. కాగా ఈ ఫోన్ అన్ని నోకియా షోరూంలలో మార్చి 1 నుంచి అమ్మకానికి రానుంది.Midnight Blue, White and Black మూడు రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.  ఈ ఫోన్ కొనుగోలు సమయంలో కంపెనీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్ టెల్ ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 2000 ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ని అందిస్తోంది. అలాగే 240 జిబి డేటాను 12 నెలల పాటు అందిస్తోంది. దీనికి యూజర్లు రూ.199,రూ.249, రూ. 448లలో ఏదైనా ఓ ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. 

నోకియా 6.1 ప్లస్ 6జిబి ర్యామ్ ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9పై, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

 నోకియా 6.1 ప్లస్‌
 నోకియా 6.1 ప్లస్‌ గ్లోస్ మిడ్‌నైట్ బ్లూ, గ్లోస్ వైట్, గ్లోస్ బ్లాక్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.15,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యమవుతోంది. నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 5.8 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు.
నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.