జడ్‌టీఈకి చెందిన నూబియా సబ్‌బ్రాండ్ రెడ్ మ్యాజిక్ 3 పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్లో ప్రపంచంలోనే తొలిసారిగా ఓ స్పెషల్ ఫీచర్ ను పొందుపరిచారు. ఇందులో హీట్‌ను తట్టుకునేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గేమ్స్ ఎక్కువ సేపు ఆడుకున్నా, వీడియోలు చూసినా, నెట్ బ్రౌజింగ్ చేసినా.. ఫోన్ వేడి కాకుండా ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది.
ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. దీనికి క్విక్ చార్జింగ్ ఫీచర్ తో 10 నిమిషాల్లోనే 1 గంట సేపు గేమ్ ఆడుకునేంత బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
ఇక ఈ ఫోన్‌కు చెందిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.35,999 ధరకు లభ్యం కానుండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.46,999 ధరకు లభ్యం కానుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందివ్వనున్నారు.
నూబియా రెడ్ మ్యాజిక్ 3 ఫీచర్లు
6.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఎక్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.