శాంసంగ్ వంటి కంపెనీలతో పోల్చితే తక్కువ ధరకే హైఎండ్ మోడల్స్‌తో ఇండియన్ మార్కెట్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న వన్‌ప్లస్ తన కొత్త మోడల్ సెల్‌ఫోన్ వన్ ప్లస్ 5ను త్వరలో తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. వన్‌ప్లస్ 3, వన్‌ప్లస్ 3టీ తర్వాత నేరుగా వన్‌ప్లస్ 5 మోడల్‌ను తీసుకురానున్నట్లు కంపెనీ సీఈవో పీట్ లా ప్రకటించారు. దీని తయారీలో కంపెనీ ఎక్స్‌పర్ట్‌లు బ్రేక్ లేకుండా పని చేస్తున్నారని, వన్‌ప్లస్ 5 మొబైల్ లవర్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ కాబోతుందని చెప్పారు. వన్‌ప్లస్ 3 తర్వాత వన్‌ప్లస్ 4 మోడల్ ప్రకటించాల్సి ఉన్నా చైనాలో అది అంత మంచిసంఖ్య కాదని నేరుగా వన్‌ప్లస్ 5నే తీసుకురావాలని కంపెనీ భావిస్తోందని ప్రచారంలో ఉంది.
భారీ స్పెసిఫికేషన్స్
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వన్ ప్లస్ 5 భారీ ఫీచర్లతోనే మార్కెట్‌లోకి రాబోతోంది. సీఈవో బిగ్ సర్‌ప్రైజ్ అని చెప్పడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ర్యామ్, స్టోరేజ్ , కెమెరా అన్నీ భారీగానే ఉండబోతున్నాయని సమాచారం.
* 5.5 ఇంచ్ 2కే డిస్‌ప్లే (1080x2048 పిక్సెల్స్)
* స్నాప్ డ్రాగన్ 835 ఎస్‌వోసీ ప్రాసెసర్
* 8 జీబీ ర్యామ్ * 256 జీబీ స్టోరేజ్
* ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్లాష్ వంటి ఫీచర్లతో 23 ఎంపీ రియర్ కెమెరా , 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 7 ఎంఎం థిక్‌నెస్
* షియోమి ఎంఐ మిక్స్ మాదిరిగా సిరామిక్ బాడీతో రావచ్చని టెక్ ఎక్స్‌పర్ట్‌లు అంచనా వేస్తున్నారు.
ప్రైస్ వన్‌ప్లస్ రేంజ్‌లోనే..
వన్‌ప్లస్ తయారీదశలో ఉందని సీఈవో చెప్పారు. తమ ఎంప్లాయిస్ పగలూ, రాత్రీ పని చేస్తున్నారన్నారు. దీంతో ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో వన్‌ప్లస్ 5 మార్కెట్‌లో లాంచ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తక్కువ ధరకే హైఎండ్ ఫీచర్లున్న ఫోన్లు మార్కెట్‌లోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న వన్‌ప్లస్ .. ఈ వన్‌ప్లస్ 5 విషయంలోనూ అదే టార్గెట్‌తో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ధర ఎంత ఉండొచ్చనే అంచనాలేమీ లేవు.