చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో కె1ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.
రూ.16,990 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్ లభిస్తోంది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఈ ఫోన్‌పై 3,6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక రూ.1కే 8నెలల కాలవ్యవధితో కూడిన 90 శాతం బై బ్యాక్ వాల్యూను ఈ ఫోన్‌కు అందిస్తున్నారు.
ఒప్పో కె1 ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ.