• తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పానసోనిక్ హల్ చల్


పానసోనిక్ వరుసగా రెండు కొత్త ఫోన్లను లాంఛ్ చేసి స్మార్టు ఫోన్ మార్కెట్లో స్పీడు పెంచింది. తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎలూగా రే' ను రూ.7,999 ధరకు రిలీజ్ చేసింది. ఇది ఆన్ లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.

ఇదే సమయంలో పీ85 పేరుతో మరో ఫోన్ను కూడా విడుదల చేసింది. దీని ధర రూ.6,499. రెండూ అందుబాటు ధరల్లో ఉండడంతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

పానాసోనిక్ ఎలూగా రే స్పెసిఫికేషన్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

పీ85 స్పెసిఫికేషన్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
4000 ఎంఏహెచ్ బ్యాటరీ