ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్ మి 3 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 12 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొన్నవారికి రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్ ఉంటాయి. 3జీబీ+32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999. ఈ ధరలు మొదటి 10 లక్షల మందికే ఉంటాయి. ఆ తర్వాత ధరలు పెరిగే అవకాశముంది. ఫీచర్ల విషయానికి వస్తే..
రియల్ మి 3 ఫీచర్లు
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.
రియల్ మి 2తో పోలిస్తే డ్యూ డ్రాప్‌డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ పై కలర్ ఓఎస్‌తో 3వ డివైస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. రియల్‌మి3 పేరుతో గఆవిష్కరించిన ఈ రియల్ మి3 స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ బ్యాక్ కెమెరాను జోడించింది. మొదటి ఫ్లాష్ సేల్‌లో ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. కాగా ఇదే ఫోన్‌కు చెందిన ప్రొ వేరియెంట్‌ను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.