• తాజా వార్తలు

redmi k20 pro, redmi k20లను ఇండియాలో రిలీజ్ చేసిన షియోమి

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి ఫ్లాగ్‌షిప్‌ కిల్లర్‌ స్మార్ట్‌ఫోన్‌ కె సిరీస్‌ను లాంచ్‌ చేసింది.  రెడ్‌మి కె సీరిస్‌లో రెడ్‌మి 20కె, 20కె ప్రొ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. కార్బన్‌ బ్లాక్‌, ఫ్లేమ్‌ రెడ్‌, గ్లేసియర్‌ బ్లూ కలర్స్‌లో ఆప్షన్‌లో వీటిని తీసుకొచ్చింది. హొరైజన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌, థియేటర్‌ గ్రేడ్‌ వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఏఐ ట్రిపుల్‌ కెమెరా,  కెమెరా ఎడ్జ్‌ లైటింగ్‌ సిస్టం పాప్‌ అప్‌కెమెరా, 20 వాట్స్‌ సోనీ చార్జ్‌ సపోర్ట్‌  ప్రత్యేకతలుగా షియోమి పేర్కొంది.

redmi-k20లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చారు. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.21,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.23,999 గా ఉంది. ఈ ఫోన్‌ను ఈ నెల 22వ తేదీ నుంచి విక్రయించనున్నారు. 

రెడ్‌మీ కె20 స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

రెడ్‌మి కే 20  ప్రొ ఫీచర్లు
6.39 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ హొరైజన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌  855  ప్రాసెసర్‌
48+13+8  ఏఐ ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
20 ఎంపీ పాపప్‌ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధర: 6 జీబీర్యామ్‌, 128 స్టోరేజ్‌ 27,999 , 8 జీబీర్యామ్‌, 256  స్టోరేజ్‌ 30,990