• తాజా వార్తలు

శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. గెలాక్సీ సీ7 ప్రో

శామ్‌సంగ్ ఎస్ 8, ఎస్‌8+ సిరీస్ ఫోన్ల కోసం టెక్నాల‌జీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ ఫోన్లు ఇండియ‌న్ మార్కెట్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈలోగా శామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ సీ7 ప్రో అనే కొత్త ఆండ్రాయిడ్ మొబైల్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 11 నుంచి అమెజాన్‌లో దీన్ని కొనుక్కోవ‌చ్చు. ఈ డ్యూయల్‌సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.27,990 అని శామ్‌సంగ్ ప్ర‌క‌టించింది. ఫోన్ ఫెర్పార్మెన్స్ చూస్తేగానీ ఇంత ధ‌ర పెట్టొచ్చు లేదా అన్న‌ది క్లారిటీ రాదు. అయితే ప్ర‌స్తుతానికి ఉన్న ఫీచ‌ర్లు చూస్తే ఈ రేట్ ఓకే అనిపించేలా ఉంది. ఆక్టాకోర్‌ ప్రాసెసర్ ఉండ‌డంతో ఫెర్పార్మెన్స్‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.
స్టైలిష్ లుక్‌.. గోల్డ్‌, రాయ‌ల్ బ్లూ క‌ల‌ర్స్‌లో ఈ ఫోన్ దొరుకుతుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న మోడ‌ల్స్‌లో ఎక్కువ శాతం 5.5 స్క్రీన్ ఉన్న‌వే. శామ్‌సంగ్ గెలాక్సీ సీ 7 ప్రో 5.7 ఇంచెస్ స్క్రీన్‌తో వ‌స్తుండడంతో డిఫ‌రెంట్ గా క‌నిపించ‌నుంది.
సూప‌ర్ సెల్ఫీలు.. శామ్‌సంగ్ నుంచి ఏకంగా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా రావ‌డం దీనిలో పెద్ద విశేషం. సాధార‌ణంగా 5 ఎంపీ కెమెరాతోనే క్వాలిటీ ఫొటోలు ఇచ్చే శాంసంగ్ నుంచి 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అంటే సుపీరియ‌ర్ క్వాలిటీనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రో, హెచ్‌డీఆర్‌, నైట్‌, ఫుడ్ ఇలా ర‌క‌ర‌కాల మోడ్‌లు అందుబాటులోకి ఉన్నాయి. మ‌రిన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు.
ఇవీ ఫీచ‌ర్లు.. స్క్రీన్‌: 5.7 అంగుళాలు ప్రాసెస‌ర్‌: 2.2 గిగాహెర్ట్జ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్ ర్యామ్‌: 4జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ: 64 జీబీ (ఎస్‌డీ కార్డుతో 256 జీబీకి ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు) కెమెరా: ఫ‌్రంట్‌, రియ‌ర్ రెండు వైపులా 16 ఎంపీ బ్యాట‌రీ : 3,300 ఎంఏహెచ్‌ ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌ సిమ్ స్లాట్‌: 2 నానో సిమ్‌లు