అంతర్జాతీయంగా ట్యాబ్లెట్లకు గిరాకీ బాగా తగ్గిపోయింది. అయినా కూడా దిగ్గజ సంస్థ శాంసంగ్ తాజాగా మరో ట్యాబ్ ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే ట్యాబ్లెట్ పీసీ 'గెలాక్సీ ట్యాబ్ ఎస్3'ని భారత మార్కెట్లో విడుదల చేసింది.
నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లోనే దీన్ని లాంచ్ చేశారు. ప్రకటించిన ప్రకారమే ఇప్పుడు దీన్ని మార్కెట్లోకి విడుదల చేశారు.
కాగా ఈ ట్యాబ్ ధర రూ.47,990.. లాంచింగ్ సందర్భంగా పలు ఆన్ లైన్ ఆఫర్లను దీనిపై ప్రకటించారు.
స్పెసిఫికేషన్లు ఇవీ..
* 9.7 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2048 x 1536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.15 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, వైఫై డైరెక్ట్, యూఎస్‌బీ టైప్ సి
* 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్