జపాన్ కు చెందిన ఎలక్ర్టానిక్స్ సంస్థ శాన్‌సుయ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హారిజాన్ 2' ను విడుదల చేసింది. రూ.4,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా విక్రయిస్తోంది. వారం కిందటే ఈ మోడల్ ను జపాన్ , చైనాల్లో లాంఛ్ చేయగా తాజాగా భారత్ లోనూ విక్రయానికి పెట్టింది.
ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) సాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫెసిలిటీస్ పొందగలగగడం దీని ప్రత్యేకత. ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను దీనితో నియంత్రించవచ్చు. కాగా హారిజాన్ శ్రేణిలో నెల కిందట హారిజాన్ 1 అనే మోడల్ ను కూడా శాన్ సుయ్ మార్కెట్లో లాంఛ్ చేసింది.