టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా.. ఎంత ఖరీదైన గ్యాడ్జెట్ మీ చేతిలో ఉన్నా దానిలో బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే అది వేస్టే. ఎంత ఛార్జింగ్ పెట్టుకని బయలుదేరినా ఇంటర్నెట్ యూసేజ్, యాప్‌ల తాకిడికి బ్యాటరీ ఇట్టే అయిపోతోంది. ఇలాంటి సమస్యకు పవర్ బ్యాంక్‌లు మంచి పరిష్కారం చూపాయి. పవర్ బ్యాంక్ కొనాలంటే కనీసం వెయ్యి రూపాయలు పెట్టాలి. అది కూడా పవర్ కనెక్షన్ ఉంటేనే పవర్ బ్యాంక్ రీఛార్జి చేయగలం. కానీ పవర్ లేకపోయినా సోలార్ ఎనర్జీతో రీఛార్జి అయ్యే పవర్ బ్యాంక్ వచ్చేసింది.. ధర కూడా వెయ్యి లోపే.. కావాలంటే ఓ లుక్కేసేయండి..
యుఐఎంఐ టెక్నాలజీస్ సంస్థ మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా సోలార్ పవర్‌తో పనిచేసే కొత్తరకం పవర్ బ్యాంక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. . 'యూ3 మినీ' పేరిట విడుదలైన ఈ పవర్ బ్యాంక్ బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ . ధర రూ.500 పైన ఉంటుంది. 6000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్ అయితే రూ.599 పై నుంచి రూ.700 మధ్యలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి అన్ని ఈ -కామర్స్ వెబ్‌సైట్లలోనూ దొరుకుతుంది. ఈ పవర్ బ్యాంక్‌పైన ఫొటో వోల్టాయిక్ ప్యానల్ ఉంటుంది. దీని ద్వారా సౌర శక్తిని గ్రహించి పవర్ బ్యాంక్‌ను రీఛార్జ్ చేస్తుంది. దీంతోపాటు కరెంటుతోనూ ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఇవీ ప్రత్యేకతలు
* ఈ పవర్ బ్యాంక్ వాటర్, డస్ట్ ప్రూఫ్.
*దీనితో ఒకేసారి రెండు డివైస్‌లకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. సెల్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ ఇలా ఏ డివైస్ అయినా ఛార్జ్ చేసుకోవచ్చు.
* 2.4 వాట్ల సామర్థ్యం ఉన్న ఓ ఎల్‌ఈడీ టార్చి లైట్ కూడా ఉంది.
* దీనిమీద ఉన్న లైట్లు బ్యాటరీ పవర్ ఇంకెంత మిగిలి ఉంది? ఎంత వరకు ఛార్జింగ్ అయిందో చెప్పేస్తాయి.