ఈ రోజుల్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. సోసల్ మీడియా విస్తరించిన తరువాత స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ బయటకు అడుగుపెట్టడం లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్‌ఫోన్లతోనే చాలామంది కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్‌తో ఆరోగ్యానికి ముప్పు కూడా అంతకంటే ఎక్కువే పొంచి వుందని వారు హెచ్చరిస్తున్నారు.
జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ విషయం మీద సంచలన విషయాలను వెల్లడించింది. షియోమి, వన్‌ప్లస్‌కు చెందిన నాలుగు స్మార్ట్‌ఫోన్లు అతి ప్రమాదకరమైనవిగా ఈ నివేదికలో పేర్కొంది.
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రూపొందించిన నాలుగు స్మార్ట్‌ఫోన్లు గరిష్టంగా రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది. టాప్ 16 జాబితాలో ఎనిమిది ఫోన్లు షియోమి, వన్‌ప్లస్‌కి చెందినవి ఉన్నాయని వెల్లడించింది. ఫోన్ల వారీగా చూస్తే.. షియోమికి చెందిన ఆండ్రాయిడ్ వన్ స్మార్టఫోన్ ఎంఐఏ1, అలాగే వన్‌ప్లస్ కు చెందిన 5టీ స్మార్ట్‌ఫోన్లు ముందువరుసలో ఉన్నాయి. షియోమి, వన్‌ప్లస్ తరువాత ఈ జాబితాలో ఆపిల్ ఐ ఫోన్ 7, ఆపిల్ ఐ ఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లు రేడియేషన్ పరంగా చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని రిపోర్టు చేసింది.
ఆసక్తికర అంశం ఏంటంటే అతి తక్కువ రేడియేషన్ ప్రభావం ఉన్న ఫోన్లలో కొరియా దిగ్గజం శాంసంగ్ డివైస్‌లు నిలవడమే. ఎల్‌జీ, హెచ్‌టీసీ, మోటోరోలా, హువాయి, హానర్ లకుచెందిన ఫోన్లు తక్కువ రేడియేషన్ విడుదల చేస్తున్నాయని ఈ సంస్థ నివేదించింది.ఇతర చైనా కంపెనీలు ఒప్పో, వివో తయారు చేసిన స్మార్ట్‌ఫోన్లను పరీక్షించలేదని కూడా పేర్కొంది.