• తాజా వార్తలు

15 వేలలో లభిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ల పూర్తి సమాచారం మీకోసం

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇప్పుడు వినియోగదారులంతా సరికొత్త టెక్ వైపు అడుగులు వేస్తున్నారు. మీరి ఈ సరికొత్త టెక్ ని అందుకోవాలంటే ముఖ్యంగా వారి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండాలి. అందులో వీలైనంత ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం ఉండాలి. సరికొత్త గేమ్స్ ఆడుకోవాలన్నా, యాప్స్ రన్ కావాలన్నా తప్పనిసరిగా ర్యామ్ ఎక్కువగా ఉండాలి. దీన్ని పసిగట్టిన కంపెనీలు కూడా 6జిబి ర్యామ్ తో కూడిన  ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.  ఇప్పుడు మార్కెట్లో కేవలం రూ. 15 వేల బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్టు చాలామందికి తెలియకపోవచ్చు. వారికోసం పూర్తి సమాచారం ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.  

Asus Zenfone Max Pro M1
దీని ధర రూ. 12,499
అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 ఫీచర్లు
5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 16 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Xiaomi Redmi Note 5 Pro
దీని ధర రూ. 13,499 
షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Realme 1
దీని ధర రూ. 12,900
రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు    
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Motorola Moto X4 6GB RAM
దీని ధర రూ. 12,999
మోటో ఎక్స్4 ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Coolpad Cool Play 6
దీని ధర రూ. 12,499
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 653 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్ (అప్‌గ్రేడ‌బుల్ టు ఆండ్రాయిడ్ 8.0), డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.