• తాజా వార్తలు

జూలైలో రానున్న కొత్త ఫోన్స్‌లో త‌ప్ప‌క తెలుసుకోవాల్సినవి మీకోసం

మొబైల్ కంపెనీల‌న్నీ ర‌క‌ర‌కాల ఫీచ‌ర్ల‌తో ప్ర‌తి నెలా కొత్త కొత్త ఫోన్ల‌ను విడుదల చేస్తూనే ఉన్నాయి. కెమెరాలు, సెక్యూరిటీ, డిస్ల్పే.. ఇలా ఫీచ‌ర్లు మార్చి కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను ప్రవేశ‌పెడుతూనే ఉంటున్నాయి. మ‌రి ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎలాంటి మొబైల్స్ మార్కెట్‌లోకి రాబోతున్నాయి?  జూలైలో విడుద‌ల‌వ‌బోతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవి? ఏఏ స్పెసిఫికేష‌న్ల‌తో వ‌స్తున్నాయో తెలుసుకుందాం!

హాన‌ర్ 9ఎక్స్‌

హాన‌ర్ సంస్థ ఇటీవ‌లే కొత్త స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 9ఐ ని చైనాలో లాంఛ్ చేసింది. ప్ర‌స్తుతం దీనిని `9ఎక్స్‌`గా ఇండియాలో ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. 5.84అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ల్పే గ‌ల ఈ ఫోన్‌.. కిరిన్ 659 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ మీద ర‌న్ అవుతుంది. అంతేగాక ఇందులో మాలి టీ830 ఎంపీ2 జీపీయూ ఉంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్ష‌న్ ఓరియోతో వ‌స్తున్న ఈ ఫోన్‌లో బ్యాక్ 13+2 మెగాపిక్స‌ల్ డ్యుయెల్ కెమెరా, ఫ్రంట్ 16ఎంపీ కెమెరా ఉన్నాయి. ముఖ్యంగా ఫింగ‌ర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ సెన్స‌ర్లు నిక్షిప్త‌మై ఉన్నాయి. బ్యాట‌రీ 3000 ఎంఏహెచ్‌. ఆసుస్ జెన్‌ఫోన్ 5జెడ్‌ ఇంచుమించు ఐఫోన్-ఎక్స్ ను పోలిన స్మార్ట్‌ఫోన్లు జెన్‌ఫోన్ 5జెడ్‌, జెన్‌ఫోన్ 5ను ఆసుస్‌ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. వీటిలో జెన్‌ఫోన్ 5జెడ్ జూలై 4న ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి ఉండ‌బోతోంది. 6.2 అంగుళాల సూప‌ర్ ఐపీఎస్ డిస్ల్పే గ‌ల ఈ ఫోన్‌.. స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్ మీద ర‌న్ అవుతుంది. ఆండ్రాయిర్ ఓరియోతో వ‌చ్చినా.. త‌ర్వాత ఆండ్రాయిడ్ పి కి త్వ‌ర‌లోనే అప్‌డేట్ కావొచ్చు. ఫ్రంట్ 8ఎంపీ, బ్యాక్ 12 ఎంపీ+8మెగా పిక్స‌ల్ డ్యుయెల్ కెమెరా క‌లిగి ఉంటుంది. 3,300 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల‌ ఈ ఫోన్.. ఫాస్ట్ చార్జింగ్‌కి స‌పోర్ట్ చేస్తుంది. 

బ్లాక్‌బెర్రీ కీ2

షియోమీ, ఒప్పో, హాన‌ర్.. కంపెనీల నుంచి ఎన్ని స్మార్ట్‌ఫోన్లు వ‌స్తూ ఉన్నా.. బ్లాక్‌బెర్రీ బ్రాండ్‌ను కూడా కోరుకునే వారు లేక‌పోలేదు. ప్ర‌స్తుతం ఈ కంపెనీ నుంచి కీ2 మోడ‌ల్‌ రాబోతోంది. 4.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ క‌లిగి ఉన్న ఈ ఫోన్ క్వ‌ర్టీ కీ ఫ్యాడ్‌, బ్యాక్‌ డ్యుయెల్ కెమెరాల‌తో అందుబాటులోకి వ‌స్తోంది. బ్యాక్ 12+12ఎంపీ కెమెరాల‌తో పాటు ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంటుంది. స్నాప్‌డ్రాగ‌న్ 660 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో రెండు మోడ‌ళ్ల‌లో ల‌భించ‌నుంది. 6జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ గ‌ల ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3,360 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంటుంది. ఇక స్పేస్‌బార్‌లోనే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటుంద‌ట‌. 

షియోమీ ఎంఐ ఏ2

ఎంఐ ఏ1 త‌దుప‌రి సిరీస్‌లో భాగంగా.. షియోమీ ఏ2ను విడుద‌ల చేయ‌బోతోంద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. అయితే స్పెయిన్‌లో జ‌రిగే స‌ద‌స్సులో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌నే విష‌యాలు చెబుతార‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం ఏ2తో పాటు ఎంఐ8, ఎంఐ8 స్టాండ‌ర్స్ ఎడిష‌న్‌(ఎస్ఈ) మోడ‌ళ్లు జూలైలో విడుద‌ల కావొచ్చ‌ట‌. ఎంఐ ఏ2 ఫోన్.. ఇటీవ‌ల చైనాలో విడుద‌ల చేసిన ఎంఐ 6ఎక్స్ త‌ర‌హాలోనే ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ల్పేతో స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌తో ప‌నిచేస్తుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్‌తో క‌లిగి 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో ల‌భిస్తాయ‌ట‌. ఇది కూడా ఆండ్రాయిడ్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ క‌లిగి ఉంటుంద‌ట‌. బ్యాక్ 20ఎంపీ+8ఎంపీ డ్యుయెల్ కెమెరాతో పాటు ఫ్రంట్ సెల్ఫీల కోసం 20 మెగా పిక్స‌ల్ కెమెరా ఉండ‌బోతోంది.  

వివో నెక్స్‌

వివో ఈసారి NEX A, NEX S మోడ‌ళ్ల‌ను లాంచ్ చేయ‌బోతోంది. ఒక‌టి స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌తోనూ మ‌రొక‌టి స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌తో నూ ప‌నిచేస్తాయి. 6.59 అంగుళాల Super AMOLED స్క్రీన్‌తో ఈ మొబైల్స్ రాబోతున్నాయి. అంతేగాక NEX Aలో ఫేస్ రిక‌గ్న‌జైష‌న్ టెక్నాల‌జీతో పాటు ఇన్ డిస్ల్పే ఫింగ్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంద‌ట‌. NEX Aలో 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతోనూ, NEX S 8జీబీ ర్యామ్‌తో 128 జీబీ, 256జీబీ స్టోరేజ్ ఉంటుంది.  వెనుక భాగంలో 12MP+5MP కెమెరాల‌తో పాటు ముందు భాగంలో 8MP లెన్స్ కెమెరా ఉంటుంది. ఓరియోతో పాటు వివో ఫ‌న్‌ట‌చ్ ఓస్‌ 4.0తో వ‌చ్చే ఈ మొబైల్స్‌.. 4,000ఎంఏహెచ్ బ్యాట‌రీతో రాబోతున్నాయి. 

ఒప్పో Find X

ఒప్పో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను ఎక్స్ సిరీస్‌తో లాంచ్ చేస్తోంది. వీటిల్లో ముందు భాగంలో పూర్తిగా డిస్ల్పేనే ఉండ‌బోతోంది. గ్లాస్ బాడీతో పాటు త్రీడీ క‌ర్వ్‌డ్ షేప్‌లో ఫినిషింగ్‌తో రాబోతున్నాయి. 6.42 అంగుళాల AMOLED డిస్ల్పేతో 19:5:9 స్క్రీన్ బాడీతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొట‌క్ష‌న్ క‌లిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగ‌న్ 845 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌తో ప‌నిచేసే ఈ మొబైల్‌ 8GB ర్యామ్‌, 128GB/256GB ఇంట‌ర్న‌ల్ జీబీ మోడ‌ళ్ల‌లో ల‌భించ‌బోతోంది. ఇందులో 16MP +20MP కెమెరాలు వెనుక భాగంలో, 25MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప‌నిచేసే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 3,400 ఎంఏహెచ్‌!

మోటోరోలా వన్ ప‌వ‌ర్‌(One Power)

మోటో వ‌న్, మోటో వ‌న్ ప‌వ‌ర్ మోడ‌ళ్ల‌ను విడుద‌ల చేసే అవ‌కాశ‌ముంది. వీటిలో 19:9 స్క్రీన్ బాడీ క‌లిగి, స్నాప్‌డ్రాగ‌న్ 636 ప్రాసెస్ మీద ప‌నిచేస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని ఒకేరోజు విడుద‌ల చేసే అవ‌కాశ‌ముంది. మోటో వ‌న్ ప‌వ‌ర్ మెట‌ల్ బాడీతో, మోటో వ‌న్ గ్లాస్ బ్లాక్ బాడీతో రావొచ్చ‌ని అంచ‌నా! 

మోటో ఈ5 ప్లస్ (E5 Plus)

ఈ5 ప్లస్ త్వ‌ర‌లోనే ఇండియాలో మోటో లాంచ్ చేయ‌బోతోంది. E5తో పాటు E56 Play అనే రెండు మోడ‌ళ్ల‌ను విడుద‌ల చేయ‌బోతోంది. ప్లాస్టిక్ బాడీతో ఆరు అంగుళాల HD డిస్ల్పే ఉండ‌బోతోంది. స్నాప్ డ్రాగ‌న్ 435 ప్రాసెస‌ర్‌తో ప‌నిచేస్తాయి.  3GB ర్యామ్‌, 32GB ఇంటర్న‌ల్ స్టోరీజ్‌తో పాటు మెమొరీకార్డు స‌దుపాయం కూడా ఉంటుంది. Moto E5 Plusలో 12MP కెమెరా వెనుక భాగంలో, 8MP కెమెరా ముందు భాగంలో ఉంటాయి. 5000ఎంఏహెచ్ గ‌ల భారీ బ్యాట‌రీతో వ‌చ్చే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఓరియో మీద ప‌నిచేస్తుంది.