దిగ్గజ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ ని తీసుకొస్తోంది. వివో ఎస్1 ప్రొ పేరుతో భారత మార్కెట్‌లో ఈఫోన్ ను ఆవిష్కరించింది. ఇటీవల భారత్‌లోకి తీసుకొచ్చిన వివో వీ15 ప్రొ ఫీచర్లతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 6జీబీ, 8 జీబీ రెండు వేరియంట్లో అందుబాటులో ఉండనుంది. అలాగే ట్రిపుల్ రియర్‌కెమెరా, 32 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఆకర్షణగాఉన్నాయి. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 27,700గా నిర్ణయించింది. స్కైలైన్ బ్లూ, డైమాండ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.
వివో ఎస్1 ఫీచర్లు
6.38 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ,2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి65 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ ,ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు ,32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0 ,ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ ,4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
ఫోటోగ్రఫీ
ఫోన్‌లో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా (16 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ) ఉంటుంది. కంపెనీ ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చింది. దీని ద్వారా సెల్పీ అభిమానులు అదిరిపోయే విధంగా ఫోటోలు తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.17,990 ధరకు, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.18,990 ధరకు లభిస్తున్నాయి. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.19,990 ధరకు విక్రయిస్తున్నారు. కాగా ఈ ఫోన్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో విక్రయిస్తున్నారు.