చైనా మొబైల్స్ మేకర్ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి15 ప్రొ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లుగా కంపెనీ తెలిపింది. వెనుకవైపు మూడు కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా పొందుపర్చింది. దీని ధరను ధర రూ.28,990లుగా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా మార్చి 6వ తేదీనుంచి అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా పలు లాంచింగ్ ఆఫర్లను కూడా ఈ ఫోన్‌కు అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే 6 నెలల కాలవ్యవధి గల ఉచిత వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను ఈ ఫోన్‌తో అందిస్తున్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఈ ఫోన్‌పై జీరో డౌన్ పేమెంట్‌ను అందిస్తున్నది.
ఇందులో 6.39 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉన్న పాపప్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. కేవలం 0.46 సెకన్ల వ్యవధిలోనే కెమెరా బయటకు వచ్చేవిధంగా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక భాగంలో 12, 5, 8 మెగాపిక్సల్ కెమెరాలు మూడింటిని ఏర్పాటు చేశారు. ఇందులో 3700 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి డ్యుయల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
వివో వి15 ప్రొ ఫీచర్లు
6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్.