• తాజా వార్తలు

బి అలర్ట్ : షియోమి నుంచి 108 ఎంపీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్..

ఇప్పుడు మార్కెట్లో దిగ్గజ కంపెనీల మధ్య  స్మార్ట్‌ఫోన్ వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కెమెరా విభాగంలో దిగ్గజ మొబైల్ కంపెనీలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు అత్యధిక ఫిక్సల్ తో కెమెరాలను విడుదల చేశాయి. షియోమి  48 ఎంపీ కెమెరాతో మార్కెట్‌లో ఇప్పటికే ట్రెండ్ సెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో కంపెనీ  100 లేక 108 ఎంపీతో స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ట్విట్టర్లో విడుదలయ్యాయి. షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, షియోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్  ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. 

ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్లలో 48 మెగాపిక్సెల్‌ కెమెరాను చూడగా, త్వరలో 64 ఎంపీ కెమెరాతో శాంసంగ్, షియోమీతోపాటు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు  విడుదల కానున్నాయి. ఈ న్యూస్  సంచలనం అయ్యే లోపే షియోమి కంపెనీ 100 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌కు చుట్టింది. శాంసంగ్‌ సెన్సార్‌తో ఇది రూపుదిద్దుకోనుందని సమాచారం. ఈ ఫోన్లో 108,000,000 పిక్సెల్స్, 12032x9024 రిజల్యూషన్‌ ఉండనుంది. అల్ట్రా క్లియర్‌ కెమెరా ఆవిష్కరించనున్నట్టు షియోమీ ఇండియా హెడ్‌ మను కుమార్‌ జైన్‌ వెల్లడించారు. 

మను కుమార్ జైన్ 100 ఎంపీ స్మార్ట్‌ఫోన్ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. ఇకపోతే 100 ఎంపీ కెమెరా సెన్సర్‌పై ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. క్వాల్‌కామ్ కంపెనీ ఈ ఏడాది చివరకు 100 ఎంపీ సెన్సర్ అందుబాటులోకి తీసుకురావొచ్చనే అంచనాలున్నాయి. 

షియోమి 100 ఎంపీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తే ప్రపంచంలో తొలి 100 ఎంపీ కెమెరా ఫోన్ ఇదే కానుంది.కాగా 100 ఎంపీ కెమెరా మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చిలో లెనొవో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 100కు బదులుగా 108 ఎంపీతో షియోమీ తన ఫోన్‌ ను తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.