• తాజా వార్తలు

ఆసక్తి రేపుతున్న షియోమి ఫోల్డబుల్ ఫోన్ టీజర్ 

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి సరికొత్త ప్రయోగానికి ఇదివరకే శ్రీకారం చుట్టింది.  షియోమి ప్రోటోటైప్ టు-వే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి మరో వీడియోని షేర్ చేసింది. ఫోల్డబుల్ ప్రోటోటైప్ డబుల్ ఫోల్డింగ్ డిజైన్‌తో వస్తోంది. అయితే ఈ ఫోన్‌ ఫీచర్లు, తదితర వివరాలను వెల్లడించలేదు.  తాజాగా 10 సెకన్ల నిడివిగల మరో వీడియో టీజర్‌ను కంపెనీ షేర్‌ చేసింది. ఫీచర్లు, ధర వివరాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ సినిమా లెవల్లో టీజర్లు, రిలీజ్‌ డేట్‌ అంటూ భారీ హైప్‌ మాత్రం క్రియేట్‌ చేస్తోంది.

కాగా ఈ ఫోన్‌కు సంబంధించి షియోమి వైస్‌ ప్రెసిడెంట్‌ వాంగ్‌ చాంగ్‌ ఈ ఏడాది జనవరిలో ఒక వీడియోను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. 2019  రెండవ త్రైమాసికంలో దీన్ని లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే.. లక్షా 37వేల రూపాయల వరకు ధర నిర్ణయించవచ్చని అంచనా. ఫ్లాట్‌, డబుల్‌ ఫోల్డబుల్‌ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ రానుంది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన ఇతర ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు ఇది పూర్తిగా విభిన్నంగా ఉండనుందని సమాచారం.

వీడియోని మొదట షియోమీ అధికారిక వీబో అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ ప్రోటోటైప్ కనిపిస్తోంది. వీడియోలో ఒక వ్యక్తి ఫోన్ ని అన్ ఫోల్డెడ్ స్టేట్ లో పోర్ట్రేట్ మోడ్ లో ఉపయోగిస్తూ కనిపిస్తున్నారు. ఆ తర్వాత అతను ఫోన్ ఓరియంటేషన్ మారుస్తాడు. ఫోన్ ను రెండు వైపుల నుంచి మడిచి నూడుల్స్ బాక్స్ లో పెడుతున్నాడు. స్క్రీన్ ఓరియంటేషన్ మార్చడం, ఫోన్ యుఏఐని ట్యాబ్లెట్ మోడ్ నుంచి ఫోన్ మోడ్ లోకి మార్చగానే సాఫ్ట్ వేర్ ల్యాగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దాకే మార్కెట్ లోకి విడుదల చెయ్యాలని షియోమి భావిస్తున్నట్లు సమాచారం.