షియోమీ తన ప్రతిష్ఠాత్మక ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'ఎంఐ6' ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. ఎంఐ5 సక్సెస్ తరువాత ఆ సిరీస్‌లో షియోమీ విడుదల చేస్తున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే. దీంతో ఆ ఫోన్ కోసం స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫోన్‌ను షియోమీ ఈ నెల 19వ తేదీన బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ జిమ్నాజియంలో విడుదల చేయనుంది. అదే కార్యక్రమంలో ఎంఐ 6 ప్లస్ ను కూడా విడుదల చేస్తున్నట్టు తెలిసింది. కానీ దాని గురించిన అధికారిక వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగా షియోమీ ఎంఐ6 ఫోన్ 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ వేరియెంట్లలో విడుదల కానుంది. 4 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.20,525 ధరకు లభ్యం కానుండగా, 6 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.24,278 ధరకు లభించనుంది.
ఎంఐ6లో ఏముందంటే..
* 5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్రెజర్ సెన్సిటివ్ డిస్‌ప్లే
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
* 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్
* 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2
* ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ