• తాజా వార్తలు

డోంట్ వర్రీ, లాక్‌డౌన్‌లోనూ ఫ్రెష‌ర్ల‌కు ఉద్యోగాలు... శుభ‌వార్త చెప్పిన కాగ్నిజెంట్ 

క‌రోనా దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. డైలీ లేబ‌ర్ నుంచి ఐటీ దాకా, మీడియా నుంచి మార్కెట్ దాకా అన్నింటా ఇదే ప‌రిస్థితి. ఇక ఐటీ సెక్టార్ మీదే ఆశలు పెట్టుకుని ఇంజినీరింగ్ చ‌దువుతున్న ల‌క్ష‌ల మందికి ఇప్పుడు కొత్త బెంగ పుట్టుకొచ్చింది. ఆఫ‌ర్ లెట‌ర్స్ ఇచ్చిన కంపెనీలు త‌మ‌కు జాబ్స్ ఇస్తాయా లేదా అని వాళ్లు ఆందోళ‌న‌గా ఉన్నారు. దానికి తోడు మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీలు కూడా కొత్త వాళ్ల‌ను తీసుకోవ‌డంలో ఆచితూచి వెళ‌తామ‌ని చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఐటీ మేజ‌ర్ కాగ్నిజెంట్ మాత్రం ఫ్రెష‌ర్ల‌కు ఓ శుభ‌వార్త చెప్పింది.

20వేల జాబ్స్ 
బ‌డా ఐటీ కంపెనీల‌న్నీ ఫ్రెష‌ర్ల‌ను తీసుకోవడంలో సందిగ్థ‌త మెయింటెయిన్ చేస్తున్నాయి. కానీ  ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ మాత్రం వాళ్ల‌కో తీపిక‌బురు చెప్పింది.  ఫ్రెషర్లకు ఏకంగా 20వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  ఈ విష‌యాన్ని కంపెనీ అధికారికంగా ప్ర‌క‌టించింది.

లాస్‌లో ఉన్నా 
నిజానికి కరోనా కారణంగా కాగ్నిజెంట్ కూడా దెబ్బతింది. దాని నికర లాభం ఈ మార్చి క్వార్టర్‌లో 17 శాతం తగ్గింది. నిరుడు ఈ క్వార్టర్‌లో 44 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 37 కోట్ల డాలర్లకు తగ్గిందట‌.  అయితే ఆదాయం మాత్రం 3 శాతం పెరిగింద‌ని, మొత్తంగా  420 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ బ్రియాన్‌ హంఫ్రీస్‌ వెల్లడించారు. జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు 3 నెల‌ల కాలంలో భారీడీల్స్ సంపాదించామ‌ని, అందువ‌ల్ల ఫ్రెష‌ర్ల‌కు 20వేల ఉద్యోగాలు గ్యారంటీ అని ఆయ‌న గుడ్‌న్యూస్ చెప్పారు.  

జన రంజకమైన వార్తలు