సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ చైర్మన్, ఎండీ రాజేశ్ నంబియార్ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు. ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో అవకాశం కల్పిస్తామని చెప్పారు .
టాప్ రిక్రూటర్
ఇంజనీర్స్ తో పాటు గ్రాడ్యుయేట్స్ కి కూడా క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో అవకాశం ఇస్తూ కాగ్నిజెంట్ టాప్ రిక్రూటర్‌గా కొనసాగనుందని ఆయన పేర్కొన్నారు. కరోనా తో మార్కెట్ గందరగోళంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది యూనివర్సిటీ క్యాంప్‌సల నుంచి 17,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకున్నట్లు నంబియార్ చెప్పారు. 70 % స్టాఫ్ మనదేశంలోనే కాగ్నిజెంట్ హెడ్ క్వార్టర్ అమెరికా. అయినా ఇండియాలోనే కంపెనీ కార్యకలాపాలు ఎక్కువ. కాగ్నిజెంట్ సిబ్బందిలో 70 శాతం మంది భారత కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు.