• తాజా వార్తలు

మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను గుప్పించ‌డానికి అమేజాన్ వ్యూహాలు ర‌చిస్తోంది. డీమానిటైజేష‌న్ పుణ్య‌మా అని ఢీలాప‌డ్డ వ్యాపార వ‌ర్గాల్లో ఉత్సాహం నింప‌డానికి త‌మ మెగా సేల్ ఉప‌యోగ‌ప‌డ‌తుంద‌ని అమేజాన్ తెలిపింది. క‌చ్చితంగా ఈ సేల్‌కు గ‌తంలో కంటే భారీ స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహిస్తున్న‌ట్లు చెప్పింది. కేవ‌లం ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్లే కాకుండా అన్ని విభాగాల్లో భారీగా ఆఫ‌ర్లు పెట్టి ఫ్లిప్‌కార్ట్ కంటే ముందే వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవాల‌ని అమేజాన్ చూస్తోంది.

ఇవే హైలైట్స్‌
1. వ‌న్‌ప్ల‌స్‌, శాంసంగ్‌, మోట‌రోలా స్మార్ట్‌ఫోన్ల మీద భారీగా ఆఫ‌ర్లు
2. సిటీ క్రెడిట్‌, డెబిట్‌కార్డు వినియోగ‌దారుల‌కు క్యాష్‌బ్యాక్ స‌దుపాయం
3. అంతేకాకుండా సేల్ జ‌రిగే స‌మ‌యంలో ఎన్నో కాంటెస్ట్‌లు, బ‌హుమ‌తులు

ఆఫ‌ర్లు వేటిపై అంటే..
ప్ర‌ధాన‌మైన అన్ని స్మార్ట్‌ఫోన్‌ల‌పై భారీగా త‌గ్గింపు ధ‌ర‌లు ఇవ్వాల‌ని అమేజాన్ నిర్ణ‌యించింది. శాంసంగ్‌పై 18 శాతం వ‌ర‌కు, మోట‌రోలాపై 40 శాతం వ‌ర‌కు, కూల్‌పాడ్‌పై 9 శాతం వ‌ర‌కు, వ‌న్‌ప్ల‌స్‌పై 9 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు ఇవ్వ‌నుంది. ఇవి కాక ఎక్సేంజ్ ఆఫ‌ర్లు, ఇఎంఐ ఆఫ‌ర్లు అద‌నం. ఇవి కాక అద‌నంగా క్రెడిట్ కార్డుల‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవ‌కాశం ఉంది.

జాక్‌పాట్ కాంటెస్ట్‌
బిగ్ ఇండియ‌న్ సేల్‌లో కొనుగోలు చేసే వినియోగ‌దారుల‌కు యాక్స‌స‌రీస్‌పై 80 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఇవ్వాల‌ని అమేజాన్ నిర్ణ‌యించింది. స‌రిగా ప్లాన్ చేసుకుని కొంటే ఈ ఆఫ‌ర్ వినియోగ‌దారుల‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి. మొబైల్ క‌వ‌ర్లు, ప‌వ‌ర్ బ్యాంక్‌లు, డేటా కేబుల్స్ లాంటి ప్రొడ‌క్ట్స్‌పై దాదాపు రూ.2000 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భించే అవ‌కాశాలున్నాయి. ఒక ఏడాది కిండ‌ల్ అన్‌లిమిటెడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ రూ.1499 కే ద‌క్క‌నుంది. మాములుగా దీని ధ‌ర రూ.2388. అమేజార్ ఫైర్ టీవీ స్టిక్ రూ.499 కే ల‌భ్యం కానుంది. కేవ‌లం డిస్కౌంట్లు మాత్ర‌మే కాదు సేల్ న‌డిచే స‌మ‌యంలో జాక్‌పాట్ కాంటెస్ట్‌ల‌ను అమేజాన్ నిర్వ‌హిస్తోంది. ఇది యాప్ ద్వారా మాత్ర‌మే వాడుకోవాలి. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన వాళ్లు ఫిట్‌బిట్ బ్లాజ్ స్మార్ట్‌వాచ్‌, ఐఫోన్ 7, జేబీఎల్ ప్ల‌స్ 2 స్పీక‌ర్, శాంసంగ్ గెలాక్సీ సీ7 ప్రొ ఫోన్ల‌ను గెలుచుకునే అవ‌కాశం వినియోగ‌దారుల‌కు ఉంది. ఈ కాంటెస్ట్ ఈనెల 31 వ‌ర‌కు ఉంటుంది.

జన రంజకమైన వార్తలు