• తాజా వార్తలు

రివ్యూ - 12వేల లోపు ధ‌ర‌లో మార్కెట్‌లో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవి?

లాక్‌డౌన్‌తో అంద‌రూ ఇంటిద‌గ్గ‌రే ఉంటున్నారు. పిల్ల‌లు కూడా ఆన్‌లైన్ క్లాసెస్ విన‌డానికి ఫోనో, ట్యాబో కావాల్సి వ‌స్తోంది. ఈ ప‌రిస్థితుల్లో బడ్జెట్ రేంజ్‌లో మంచి ఫోన్ల గురించి అంద‌రూ వెతుకుతున్నారు. అందుకే 12వేల రూపాయ‌ల ధ‌ర‌లో మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చే 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివ‌రాలు మీకోసం అందిస్తున్నాం


1) రియ‌ల్‌మీ న‌ర్జో 10
రియ‌ల్‌మీ రీసెంట్‌గా రిలీజ్ చేసిన రియ‌ల్‌మీ న‌ర్జో 10.. 12వేల రూపాయ‌ల ప్రైస్ రేంజ్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌. కుర్ర‌కారును ఆక‌ట్టుకోవ‌డానికి బ‌డ్జెట్ రేంజ్‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీనిలో ఫీచ‌ర్లు ఏమిటంటే
* 6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 4జీబీ ర్యామ్‌
* 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్  
* మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెస‌ర్ 
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌
* వెనుక‌వైపు నాలుగు కెమెరాలున్నాయి. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 8ఎంపీ సెకండరీ కెమ‌రా, మ‌రో  రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి.  
* సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 
* 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ దీనికి మ‌రో అట్రాక్ష‌న్‌. 
* ధ‌ర‌: 11,999 రూపాయ‌లు

2) శాంసంగ్ గెలాక్సీ ఎం11
శాంసంగ్ నుంచి కూడా ఈ ప్రైస్‌రేంజ్‌లో మంచి ఫోన్ అందుబాటులో ఉంది. అదే లేటెస్ట్ గెలాక్సీ ఎం11. దీనిలో ఫీచ‌ర్లు, స్పెక్స్ ఏమిటంటే..
* 6.4 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ హోల్ పంచ్  ‌డిస్‌ప్లే
* 3జీబీ ర్యామ్‌
* 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్  
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్ 
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌
* వెనుక‌వైపు మూడు కెమెరాలున్నాయి. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 5ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2ఎంపీ డెప్త్ కెమెరాలున్నాయి.  
* సెల్ఫీల‌ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 
* 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ దీనికి మ‌రో అట్రాక్ష‌న్‌. 
* ధ‌ర‌: 10,999 రూపాయ‌లు

3) హాన‌ర్ 20ఐ 
ఈ బ్యాచ్‌లో మిగ‌తావాటితో పోల్చుకుంటే ఇది కాస్త పాత మోడ‌లే. కానీ మంచి స్పెక్స్ ఉన్నాయి. 
* 6.21 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ‌డిస్‌ప్లే
* 4జీబీ ర్యామ్‌
* 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్  
* కంపెనీ సొంత హైసిలికాన్ కైరిన్ 710 ప్రాసెస‌ర్ 
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌
* వెనుక‌వైపు మూడు కెమెరాలున్నాయి. ఇందులో 24 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 2ఎంపీ సెకండ‌రీ కెమెరా‌, 8ఎంపీ టెరిట‌రీ సెన్స‌ర్‌లున్నాయి.
* సెల్ఫీల‌ కోసం ఏకంగా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 
* 3,400 ఎంఏహెచ్ బ్యాట‌రీ 
* ధ‌ర‌: 10,999 రూపాయ‌లు

4) లెనోవో కే10 నోట్ 
* 6.3 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 4 జీబీ ర్యామ్‌
* 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్  
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్ 
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌
* వెనుక‌వైపు మూడు కెమెరాలున్నాయి. ఇందులో 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 5ఎంపీసెకండ‌రీ ‌సెన్స‌ర్‌, 8 ఎంపీ టెర్షియ‌రీ కెమెరాలున్నాయి.  
* సెల్ఫీల‌ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 
* 4,050 ఎంఏహెచ్ బ్యాట‌రీ 
* ధ‌ర‌: 10,999 రూపాయ‌లు

5)ఇన్ఫినిక్స్ ఎస్‌5 ప్రో
* 6.53 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 4 జీబీ ర్యామ్‌
* 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్  
* మీడియాటెక్ హీలియో పీ 35 ప్రాసెస‌ర్ 
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌
* వెనుక‌వైపు మూడు కెమెరాలున్నాయి. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 2ఎంపీసెకండ‌రీ ‌సెన్స‌ర్‌, 2 ఎంపీ లోలైట్ కెమెరాలున్నాయి.  
* సెల్ఫీల‌ కోసం 16 మెగాపిక్సెల్ మోట‌రైజ్డ్ పాప్ అప్ కెమెరా దీనిలో స్పెష‌ల్‌. ఈ ప్రైస్ రేంజ్‌లో ఈ స్థాయి పాప్ కెమెరా ఇంకే ఫోన్‌‌లోనూ లేదు. 
* 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ 
* ధ‌ర‌: 10,999 రూపాయ‌లు

6) నోకియా 6.1 ప్ల‌స్ 
పై వాటితో పోల్చుకుంటే దీనిలో ఫీచ‌ర్లు కాస్త త‌క్కువ‌గానే ఉన్నాయి. కానీ ధ‌ర కూడా వాటితో పోల్చుకుంటే త‌క్కువే. 
* 5.8 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 4 జీబీ ర్యామ్‌
* 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్  
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 636 ప్రాసెస‌ర్ 
* వెనుక‌వైపు రెండు కెమెరాలున్నాయి. ఇందులో 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 5 ఎంపీ సెకండ‌రీ ‌సెన్స‌ర్ ఉన్నాయి.  
* సెల్ఫీల‌ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
|* 3,060 ఎంఏహెచ్ బ్యాట‌రీ 
* ధ‌ర‌: 9,999 రూపాయ‌లు