• తాజా వార్తలు

ఐవోఎస్ 14 అప్‌డేట్‌ .. ఇండియాలో యాపిల్ యూజ‌ర్ల‌కు వ‌చ్చిన కొత్త ఫీచ‌ర్లు ఏమిటంటే

యాపిల్ త‌న డివైస్‌ల‌కు ఇటీవీల ఐవోఎస్ 14 అప్‌డేట్ తీసుకొచ్చింది. దీన్ని అప్‌డేట్ చేసుకుంటే మ‌రిన్ని కొత్త ఫీచ‌ర్లు, బెట‌ర్‌మెంట్స్ ల‌భిస్తాయి. ముఖ్యంగా ఐఫోన్‌, ఐప్యాడ్ వంటి యాపిల్ ఉత్ప‌త్తులు వాడే యూజ‌ర్ల‌కు రానున్న కొత్త ఫీచ‌ర్లేంటో ఓ లుక్కేద్దాం. 

ట్రాన్స్‌లేష‌న్ యాప్‌
ఐవోఎస్ 14 అప్డేట్‌లో యాపిల్ ప్రొడ‌క్ట్స్‌కు కొత్త ట్రాన్స్‌లేష‌న్ యాప్ వ‌స్తుంది. ఇది ఇండియ‌న్ ఇంగ్లీష్‌తోపాటు ప‌లు భాష‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేయ‌గ‌ల‌దు. అయితే మ‌న ప్రాంతీయ భాష‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేసే ఫీచ‌ర్ లేదు.  

దేవ‌నాగ‌రి లిపిలో ఉన్న మెయిల్ ఐడీల‌కూ స‌పోర్ట్‌
యాపిల్ డివైస్‌ల్లో ఉండే మెయిల్ యాప్ ఇక‌పై దేవ‌నాగ‌రి లిపిలో ఉండే ఈమెయిల్ ఐడీల‌ను కూడా స‌పోర్ట్ చేస్తుంది. అంటే మీ కాంటాక్ట్స్‌లో ఎవ‌రైనా ఈ లిపిలో మెయిల్ ఐడీ క‌లిగి ఉంటే వారికి నేరుగా మెయిల్ యాప్ నుంచే మెయిల్ చేయొచ్చు.  

సిరికి దేశీ ట‌చ్ 
యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరి ఐవోఎస్ 13 అప్‌డేట్‌లోనే భార‌తీయ గొంతుతో ప‌ల‌కరించేది. దీన్ని మ‌రింత డెల‌ప్ చేశారు. రోబో లాంటి వాయిస్ బ‌దులు మ‌నిషి వాయిస్‌లా వినిపించ‌డం లేటెస్ట్ అప్‌డేట్‌లో చూడొచ్చు.  

ఐమెసేజ్‌ల‌కు లోక‌ల్ ట‌చ్‌
ఐవోఎస్ 14 అప్‌డేట్‌లో ఐమెసేజ్‌ల మీద బాగా దృష్టి పెట్టారు. గ్రూప్ మెసేజ్‌లు లేదా క‌న్వ‌ర్సేష‌న్ న‌డుస్తున్న‌ప్పుడు వాట్సాప్లో మాదిరిగా ఒక యూజ‌ర్‌కు స్పెసిఫై చేసి రిప్ల‌యి ఇవ్వ‌చ్చు. దీనివ‌ల్ల ఆ మెసేజ్ ఎవ‌రికి రిప్ల‌యి అన్నన క‌న్ఫ్యూజ‌న్ పోతుంది. ఇక పోతే ఐమెసేజ్‌ల‌కు లోక‌ల్ ట‌చ్ కూడా ఇచ్చింది. అంటే దీపావ‌ళి, హోలీ లాంటి పండ‌గ‌లు వ‌చ్చిన‌ప్పుడు ఐమెసేజ్‌ల‌ను స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌తో పంప‌వ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు