ప్రస్తుతం చదువు ఎంత కష్టంతో కూడుకున్నదో... దాని తరువాత ఉద్యోగం కూడా అంతకంటే ఎక్కువ కష్టం పడాల్సి వస్తోంది. ఉద్యోగం సంపాదించడానికి నిరుద్యోగుల తంటాలు అన్ని ఇన్ని కావు. వీరందరికీ ప్రధానమైనది 'రెజ్యూం'. మన ప్రతి అడుగు దీనిద్వారా 'హెచ్ ఆర్' కనిపెట్టేస్తారు. అందుకే వీలైనంత అందంగా ఉన్న విషయాన్ని పెడితే ఉద్యోగాలు మనల్ని వెతుకుంటూ వస్తాయి. 'రెజ్యూం' తయారు చేసుకునే విషయంలో చాలా మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటారు. అసలు చాలా మందికి 'రెజ్యూం'ను ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలియదు. దీనితో ఉద్యోగాలు రాక నిరాశపడుతుంటారు. కాని దీనికి ప్రధానా కారణం మనం తయారు చేసుకునే 'రెజ్యూం' అన్న సంగతి తెలియదు. మేము చెప్పే వెబ్ సైట్ ద్వారా చాలా సులభంగా క్ష్యణాలలో 'రెజ్యూం' తయారు అవుతుంది. ఈ సైట్ ద్వారా చేసుకున్న 'రెజ్యూం'లకు మంచి పేరుతోపాటు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. దానికి కారణం మనం చేసిన పనుల్ని ఏవి ఎక్కడ హైలెట్స్ చేయాలో అక్కడ చేయడంతో హెచ్ ఆర్ వారు చాలా తొందరగా వారిపై మంచి అభిప్రాయాన్ని పెంచుకుంటున్నారు.
'రెజ్యూం' మేము అలానే తయారు చేస్తున్నాం కదా అనుకుంటారు. కాని అందులో ఎన్ని తప్పులు చేస్తారో చెప్పేదాకా తెలియదు. మన జీవితంలో మనం చేసే అన్ని పనుల్ని సోషల్ మీడియాలో మిత్రులతో పంచుకుంటూ ఉంటాం... అలాగే మన చదువు విషయాలు కూడా.... అలాంటి వాటిని హైలెట్ చేస్తూ ఒక 'రెజ్యూం' లాగా తయారుచేస్తుంది ఈ వెబ్ సైట్. దీని కోసం మన సోషల్ మీడియా అకౌంట్స్ ని ఈ వెబ్ సైట్ కి లింక్ ఇస్తే.... వాటిలో ఉన్న మంచి సమాచారాన్ని క్రోడీకరించి మీకు ఒక అందమైన 'రెజ్యూం'ని తయారు చేసి పెడుతుంది. linked in వంటి జాబ్ పోర్టల్ లో ఇలాంటి 'రెజ్యూం'లను కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటున్నాయట. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ఉద్యోగం మిమ్మల్ని వెతుకుంటూ రావచ్చు.
వెబ్ సైట్ లింక్- https://tidl.es/
|