ఒకప్పుడంటే ఏదో డిగ్రీ చేయడం ఉద్యోగ వేటలో పడడం జరిగేవి.. ఇప్పుడా పరిస్థితులు లేవు ఏదో ఒక సాంకేతిక విద్యను నేర్చుకోవడం దానికి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించడం జరుగుతోంది. రోజు రోజుకీ టెక్నికల్ జాబ్స్ విలువ పెరుగుతూ వస్తోంది. ఇలా బాగా డిమాండ్‌లో ఉన్న టెక్నికల్ జాబ్స్ కొన్సి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 15 జాబ్స్ ఏంటో చూద్దామా..
లింక్డ్ ఇన్ రిపోర్ట్
తాజాగా లింక్డ్ ఇన్ న్యూ ఎమర్జింగ్ జాబ్ రిపోర్ట్ ఆధారంగా బాగా డిమాండ్‌లో ఉన్న జాబ్స్ కొన్ని తెలిశాయి. ఎక్కువ శాలరీతో పాటు ఎక్కువ పేరు సంపాదించే జాబ్‌లగా వీటిని నిపుణులు పేర్కొంటున్నారు. బ్లాక్ చైన్ డెవెలప్‌మెంట్ ప్రకారం గత ఐదేళ్లలో భారత్‌లో టెక్నికల్ జాబ్స్ శాతం పెరిగిపోయింది. ఇలాంటి జాబ్స్‌లో ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పెషలిస్ట్, జావా స్క్రిప్ట్ డెవలపర్, రోబొబటిక్ ప్రాసెస్ యానిమేషన్ కన్సల్‌టెంట్ లాంటి జాబ్స్ ఉన్నాయి.
బ్లాక్ చైన్ డెవలపర్
బ్లాక్‌చైన్ ప్రొటోకాల్స్ ప్రకారం బిల్డ్ అయిన జాబే ఈ బ్లాక్‌చైన్ డెవలపర్. బ్లాక్ చైన్ ఆర్కిటెక్చర్ సిస్టమ్‌తో వీళ్లు పని చేయాల్సి ఉంటుంది. అన్ని యాప్స్, కాంటాక్ట్స్‌లో వీటిని యూజ్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్, ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో ఈ బ్లాక్‌చైన్ డెవలపర్స్ యూజ్ అవుతారు.
ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ స్పెషలిస్ట్
మిషన్ లెర్నింగ్‌లో స్పెషలిస్ట్‌లు యూజ్ అవుతారు. ఆటోమనస్ యాక్షన్స్ ద్వారా గోల్స్ అచీవ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రీస్‌లో ఈ ఏఐ స్పెషలిస్టులు బాగా ఉపయోగపడతారు.
జావా స్క్రిప్ట్ స్పెషలిస్టులు
జావా అనేది ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్. విజువల్ ఎలిమెంట్స్ ఎలా మూవ్ కావాలనేది ఈ జావా ద్వారానే నిర్ణయిస్తారు. ఫ్రంట్ ఎండ్‌లో దీన్ని యూజ్ చేస్తారు. వెబ్ సైట్ ప్రొగ్రామింగ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రొగ్రామింగ్, ఆర్థిక వ్యవహారాలు, ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌లలో దీన్ని ఉపయోగిస్తారు.
డిమాండ్ ఉన్న ఇంకొన్ని..
1. రోబొటిక్ ప్రాసెస్ ఆటోమెషన్ కన్సల్టెంట్
2. బ్యాక్ ఎండ్ డవపలర్
3. గ్రౌత్ మేనేజర్
4. సైట్ రిలయబిలిటీ ఇంజనీర్
5. కస్టమర్ సర్వీసెస్ స్పెషలిస్ట్
6. ఫుల్ ట్రాక్ ఇంజనీర్
7. రోబొటిక్స్ ఇంజనీర్
8. సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్
9. ఫైథాన్ డెవలపర్
10. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్
11. ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్
12. లీడ్ జనరేషన్ స్పెషలిస్టు