• తాజా వార్తలు

2020 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు ఈ-కామర్సు రంగం..

స్తు, సేవల బిల్లు (జీఎస్‌టి) అమలలోకి వస్తే ఈ-కామర్సు రంగం ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులు ఉదాహ రణకు పన్ను, లాజిస్టిక్స్‌ (రవాణా) తదితర అంశాలు ఒక కొలిక్కి వస్తాయి. దేశంలో ప్రస్తుతం ఈ - కామర్స్‌ రంగం  క్రమంగా పుంజుకుంటోందని సీఐఐ - డెలాయిట్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఈ - కామర్స్‌ రంగం విషయానికి భారత ఇంటర్నెట్‌ మార్కెట్‌ వ్యాపారం 2020 నాటికి వంద బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అభిప్రాయపడింది.

నిజానికి ఈ- కామర్స్‌ రంగం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిలో ప్రధానంగా పన్ను, రవాణా, చెల్లింపులు, ఇంటర్నెట్‌ వినియోగం, నిపుణులైన మానవ వనరులు తదితర అంశాలు ఈ రంగాన్ని పట్టి పీడిస్తున్నాయని సీఐఐ - డెలాయిట్‌లు 'ఈ - కామర్స్‌ ఇన్‌ ఇండియా - ఏ గేమ్‌ చేంజర్‌ ఫర్‌ ఎకానమీ)పై నివేదికను విడుదల చేశాయి.  పన్ను విషయానికి వస్తే .. దేశంలో ఏక పన్ను విధానం లేకపోవడంతో సరకును దేశంలోని పలు ప్రాంతాలకు తరలించాలంటే పలు చోట్ల పన్ను చెల్లించాల్సి వస్తోంది. అదే జీఎస్‌టి అమల్లోకి వస్తే ఈ ఇబ్బందులన్నీ సమసిపోతాయి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లో ఉంటుంది కాబట్టి సరకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినప్పుడు పన్ను చెల్లింపు బాధ తప్పుతుంది. దీంతో ప్రభుత్వానికి-- ఈ - కామర్స్‌ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుందని నివేదికలో పేర్కొంది.

దీంతో పాటు ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ఇండియాను కూడా అమల్లోకి తేస్తే .. ఈ - కామర్స్‌ రంగానికి మరింత లబ్ది చేకూరుతుందని.. ఎందుకంటే నిపుణులైన మానవ వనరులు లేనందున సరకును మారుమూల ప్రాంతాలకు తరలించడానికి వీలవుతుందని తెలిపింది. ఈ - కామర్స్‌ రంగానికి బలోపేతం చేయడానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో చేపట్టాల్సిన చర్యల గురించి కూడా నివేదిక సిఫారసు చేసింది.      పన్ను చెల్లింపునకు సంబంధించిన డాక్యుమెంట్లు సులభతరంగా ఉండాలని, అలాగే టాక్స్‌ రెసిడెన్సీ సర్టిఫికేట్‌కు వ్యతిరేకం అని ... పన్ను వ్యవస్థ సరళంగా ఉండాలని సిఫారసు చేసింది. ఈ- కామర్స్‌ రంగానికి చెందిన స్టార్టప్‌ పరిశ్రమకు కొన్ని సంవత్సరాల పాటు టాక్స్‌ హాలీడే ఇవ్వాలని సూచించింది.

అలాగే ఈ-కామర్స్‌ రంగంలో ప్రవేశించడం... నిష్క్రమించడం ... (పలు రాష్ట్రాల నుంచి) నిబంధనలు సడలించాలని సూచించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరకు తరలింపునకు ఒకే పన్ను విధానం ఉండాలని పేర్కొంది. జీఎస్‌టి అమలు దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలని సూచించింది. ఈ - కామర్స్‌ రంగం విషయానికి భారత ఇంటర్నెట్‌ మార్కెట్‌ వ్యాపారం 2020 నాటికి వంద బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అభిప్రాయపడింది. దీంతో పాటు జీఎస్‌టి అమలు చేయడానిికి ముందు ప్రభుత్వంలోని అన్నీ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఉదాహnరణణకకు ఆదాయపు పన్ను, అమ్మకపు పన్ను, పత్య్రక్ష పన్ను, ఎక్సైజ్‌, రిజిష్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయాలని సూచించింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ది సాధిస్తుందని, ఈ కామర్స్‌ రంగంలో నైపుణ్యం పెరుగుతుందని, పారదర్శక మెరుగుపడ్డంతో ఈ కామర్స్‌ మరింత బలోపేతం అవుతుందని సీఐఐ - డెలాయిట్‌ నివేదికలో వివరించింది. 

 

జన రంజకమైన వార్తలు