చైనా కంపెనీ అయినా ఇండియాలో పిచ్చ ఫేమస్ అయిన కంపెనీ షియోమి. ఎంఐ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్ అనే జనం చాలామందే ఉన్నారు. ఒప్పో, వివో దెబ్బతో కాస్త వెనకబడినా ఇప్పటికీ దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంఐ, షియోమి నుంచి వచ్చే కొత్త మోడల్ ఫోన్ల కోసం లక్షల మంది ఆత్రుతగా చూస్తుంటారు. అలాంటి షియోమి ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టి ఏడేళ్లయిన సందర్భంగా యానివర్సరీ సేల్ పెట్టింది. భారీ డిస్కౌంట్లతో ఆకర్షిస్తోంది.
జులై 12 నుంచి 16 వరకు
ఈ సేల్ జులై 12 నుంచి 16 వరకు ఉంటుంది. ఎంఐ.కామ్‌లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీ కార్డ్‌తో కొంటే 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్‌లో లభించే కొన్ని బెస్ట్ డీల్స్ మీకోసం..
1) ఎంఐ 10టీ ప్రో 5జీ Mi 10T Pro 5G
ఎంఐ నుంచి వచ్చిన సూపర్ ఫోన్ ఇది. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమరా, 6.67 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టాకోర్ ప్రాసెసర్ దీని సొంతం.
ధర: 47,999
యానివర్సరీ సేల్ ఆఫర్ ధర: 36,999
డిస్కౌంట్ : 11,000
2) ఎంఐ 10 టీ 5జీ Mi 10T 5G
ఎంఐ నుంచి వచ్చిన ఈ ఫోన్ కూడా 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 64 మెగాపిక్సెల్ కెమరా, 6.67 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ దీని సొంతం.
ధర: 39,999
యానివర్సరీ సేల్ ఆఫర్ ధర: 32,999
డిస్కౌంట్ : 7,000
3) ఎంఐ 11 ఎక్స్ ప్రో
ఈ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. రెండు స్టోరేజ్ వేరియంట్లున్నాయి.108 మెగాపిక్సెల్ కెమరా, 6.67 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 4,520 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ దీని సొంతం.
డిస్కౌంట్ : 8వేల రూపాయలు
ఎంఐ 10
ఈ ఫోన్‌పై 5వేల డిస్కౌంట్ లభిస్తుంది.
ఎంఐ 11ఎక్స్ 5జీ
ఈ ఫోన్‌పైనా నాలుగు వేల రూపాయల డిస్కౌంట్ ఉంది. 33,999 రూపాయల విలువైన ఈ ఫోన్ ఈ సేల్‌లో 29,999కు లభిస్తుంది.
ఎంఐ 10ఐ 5జీ
21,999 రూపాయల విలువైన ఈ ఫోన్ 4వేల డిస్కౌంట్‌లో దొరుకుతుంది. అంటే 17,999కే కొనుక్కోవచ్చు.
రెడ్‌మీ నోట్ 10 ప్రో య్యాక్స్
108 ఎంపీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లున్నాయి. మూడు వేల రూపాయల డిస్కౌంట్ పోగా 6జీబా ర్యామ్ ఫోన్ 19,999కి, 8జీబీ ర్యామ్ ఫోన్ 21,999కి లభిస్తుంది.