ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఈ నెల 31తో గడువు ముగుస్తుంది. అయితే రీసెంట్‌గా ఆగస్టు నెలాఖరు వరకు గడువు పెంచుతున్నట్లు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఈఫైలింగ్ వచ్చాక ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఈజీ అయిపోయింది. క్లియర్ ట్యాక్స్ అనే సంస్థ షియోమీతో టై అప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం షియోమీలోని ఎంఐయూఐ క్యాలెండర్ యాప్ ద్వారా నేరుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. (Mi A1) తప్ప మిగతా ఎంఐ ఫోన్లు వాడుతున్నవాళ్లందరూ ఈ ఆప్షన్ వాడుకోవచ్చు.
ఎంఐయూఐ క్యాలెండర్ యాప్‌తో ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేయడం ఎలా?
1.క్యాలెండర్ యాప్‌లోకి వెళ్లి 2018 జులై 31ని క్లిక్ చేయండి.
2. తర్వాత reminding to file ITR ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
3. వెంటనే ఆ ఆప్షన్ మిమ్మల్ని ఓ వెబ్‌పేజీలోకి తీసుకెళుతుంది. అక్కడ ఐటీ రిటర్న్స్‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసే ఆప్షన్లు ఉంటాయి.
4.ఎంప్లాయిస్ అయితే ఫారం 16ను అప్‌లోడ్ చేస్తే క్లియర్ ట్యాక్స్ ఆ ఫారంలోని మీ డిటెయిల్స్‌ను దానికదే ఫిల్ చేసుకుంటుంది. యూజర్ దాన్నిఒక్కసారి చెక్ చేసుకుని ఈ-ఫైలింగ్ చేసుకోవడానికి ప్రొసీడ్ అవ్వాలి.
5.Form-16 లేనివారు, ఎక్కువ Form-16sలు ఉన్నవారు లేదా క్యాపిటల్ గెయిన్స్ లాంటి ట్యాక్స్ కాంప్లికేషన్స్ ఉన్నవారు CA assisted plansను సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కొంత సర్వీస్ ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది.