లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన వ్యాపారాలను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావాలంటే కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చింది. ఓపక్క జనం దగ్గర డబ్బుల్లేవు.. కాస్తో కూస్తో చేతిలో డబ్బులున్నా రేపు ఎలా ఉంటుందో తెలియక జనం ఏదైనా వస్తువు కొనాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇవ్వకపోతే ప్రొడక్ట్స్ అమ్ముకోవడం కష్టమేనని కంపెనీలు గుర్తిస్తున్నాయి. ఇందులో మొదటిగా శాంసంగ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ముందుకొచ్చింది.
స్టే హోమ్.. స్టే హ్యాపీ స్కీమ్
శాంసంగ్ ఇండియా స్టే హోమ్.. స్టే హ్యాపీ స్కీమ్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఇంట్లో ఉండి వస్తువు బుక్ చేస్తే సురక్షితంగా దాన్ని హోం డెలివరీ చేస్తామని చెప్పింది.
* ఈ బుకింగ్‌ను దగ్గరలో ఉన్న శాంసంగ్ ఆథరైజ్డ్ డీలర్‌కు పంపిస్తామని, వాళ్లు మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారని ప్రకటించింది.
ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ కింద ప్రొడక్ట్ తీసుకుంటే 15% క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. అయితే ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉ్నవారికే వర్తిస్తుంది.
* అంతేకాదు శాంసంగ్ 18 నెలల వరకు లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ప్లాన్స్, నో కాస్ట్ ఈఎంఐల కింద కూడా వస్తువులను అమ్మబోతోంది.
* శాంసంగ్ షాప్‌లో ప్రీబుకింగ్ చేసుకున్నవారికి ఈఎంఐ బేస్డ్ ఫైనాన్స్ ఆప్షన్ల కింద కాకపోయినా క్యాష్ బ్యాక్ ఇస్తుంది.
ఆఫర్ వేటి మీద?
శాంసంగ్ టీవీలు
రిఫ్రిజరేటర్లు
వాషింగ్ మెషీన్లు, ఓవెన్స్ లాంటి ఇతర డిజిటల్ అప్లయన్సెస్ మీద ఆఫర్ వర్తిస్తుందని శాంసంగ్ ఇండియా కన్య్సూమర్ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజుపుల్లన్ చెప్పారు.