• తాజా వార్తలు

మొబైల్ సేల్స్‌లో దుమ్ము రేపిన షియోమి, వివో


* ఇండియ‌న్ సెల్‌ఫోన్ మార్కెట్‌లో సెకండ్, థ‌ర్డ్‌ ప్లేస్‌లు ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో చైనా కంపెనీలు దుమ్మ రేపుతున్నాయి. దేశంలో అత్య‌ధిక ఫోన్లు అమ్మిన కంపెనీగా కొరియ‌న్ ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం శాంసంగ్ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. చైనా కంపెనీ షియోమి సెకండ్ ప్లేస్లోకి దూసుకొచ్చింది. ఇక సెల్ఫీ కెమెరాల రేంజ్‌ను 20 ఎంపీ కెమెరాల‌కు తీసుకెళ్లిన వివో థ‌ర్డ్ ప్లేస్ కొట్టేసింది. ప్ర‌స్తుతం ఈ కంపెనీల ట్రెండ్ చూస్తే ఫ‌స్ట్‌ప్లేస్ టార్గెట్‌గా ముందుకెళుతున్న‌ట్లు క‌నిపిస్తోందని, అదే నిజ‌మైతే శాంసంగ్‌కు చైనా కంపెనీల నుంచి త్రెట్ త‌ప్ప‌దని మార్కెట్ వ‌ర్గాల అనాలిసిస్ . మ‌రో చైనా కంపెనీ ఒప్పో 5వ స్థానం సంపాదించింది. జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు మూడు నెల‌ల సేల్స్‌ను బేస్ చేసుకుని కెనాలిస్ అనే సంస్థ ఓ రిపోర్ట్ త‌యారు చేసింది. దీని ప్ర‌కారం టాప్ మొబైల్ సెల్లింగ్ కంపెనీల్లో మూడు చైనా కంపెనీలే సాధించాయి.
మూడు నెల‌ల్లో 2కోట్ల 70 ల‌క్ష‌ల ఫోన్లు
ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లాస్ట్ మూడు నెల‌ల్లో 12% గ్రోత్ రేట్ రికార్డ‌యింది. కెనాలిస్ రిపోర్ట్ ప్ర‌కారం 2017 తొలి మూడు నెల‌ల్లో ఇండియాలో 2 కోట్ల 70 ల‌క్ష‌ల ఫోన్లు సేల్ అయ్యాయి. శామ్‌సంగ్ ఫ‌స్ట్‌ప్లేస్ నిల‌బెట్టుకుంది. లాస్ట్ ఇయ‌ర్ ఓన్లీ 3% మార్కెట్ షేర్ తో ఉన్న షియోమీ 14% షేర్‌తో సెకండ్ ప్లేస్‌కు దూసుకొచ్చేసింది. వివో, లెనోవో, ఒప్పో 3,4, 5 ప్లేస్‌ల్లో ఉన్నాయి. రిటైల్ మార్కెట్లో ప‌బ్లిసిటీతో మార్కెట్ షేర్ పెంచుకోవాల‌న్న వివో ప్లాన్ వ‌ర్క‌వుట్ అయింది. ఈ కంపెనీ సేల్స్ 10 % పెరిగాయి. సెల్ఫీ కెమెరాల‌తో సంద‌డి చేసే మ‌రో చైనా కంపెనీ ఒప్పో కాస్త వెన‌క‌బ‌డింది. ఐదో ప్లేస్ లో నిలిచింది.

జన రంజకమైన వార్తలు